Breaking News

NARLAPUR

పేద కుటుంబానికి జడ్పీటీసీ సాయం

పేద కుటుంబానికి జడ్పీటీసీ సాయం

సారథి, రామయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన శాంభవ మల్లేశం(50) మరణించారు. విషయం తెలుసుకున్న నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.ఐదువేల ఆర్థిక సహాయంతో పాటు 50కేజీల బియ్యం అందించారు. ఆయన వెంట నార్లాపూర్ ఎంపీటీసీ రాజిరెడ్డి, నీలం తిరుపతి, నూర్​ బాషా దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఉన్నారు.

Read More
తైబందీ అమలు చేయొద్దు

తైబందీ అమలు చేయొద్దు

సారథి న్యూస్, రామాయంపేట: సుమారు పదేళ్ల తర్వాత నిండిన హైదర్​ చెరువులోని నీటిని 20,30 ఎకరాల సాగు విస్తీర్ణం కోసం విడుదల చేయొద్దని నార్లాపూర్ ముదిరాజ్ కులస్తులు, ఇతర గ్రామస్తులు నిజాంపేట తహసీల్దార్ జయరాంకు వినతిపత్రం అందజేశారు. నార్లాపూర్, తిప్పనగుళ్ల, శోకత్ పల్లి గ్రామాలకు చెందిన ముదిరాజ్, బెస్త కులస్తులు ఈ చెరువులో 10లక్షల చేప పిల్లల మేర పెంచారని వివరించారు. నీటిని విడుదల చేస్తే అవి చనిపోయే ప్రమాదం ఉందన్నారు. చెరువులో నీళ్లు ఉండడం ద్వారా […]

Read More
కిడ్నీ మార్పిడికి ఆర్థిక సాయం

కిడ్నీ మార్పిడికి ఆర్థిక సాయం

సారథి న్యూస్​, నిజాంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన రాజేందర్ గౌడ్ కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో వైద్య ఖర్చులు, కిడ్నీ మార్పిడి కోసం బాధిత కుటుంబసభ్యులు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన రూ.మూడులక్షల ఎల్వోసీని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తన క్యాంపు ఆఫీసులో బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.

Read More
ముగిసిన మాజీ ఎమ్మెల్యే కటికనేని అంతిమయాత్ర

మాజీ ఎమ్మెల్యే కటికనేనికి కన్నీటి వీడ్కోలు

సారథి న్యూస్, కొల్లాపూర్: కొల్లాపూర్​ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావుకు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్ర కొల్లాపూర్ పట్టణంలో కొనసాగించారు. పట్టణంలోని మినీ స్టేడియంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. ప్రజలు వివిధ మండలాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, టీడీపీ వర్గీయులు, ఆయన బంధుమిత్రులు, అభిమానులు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో అంతిమయాత్ర కొనసాగింది. కొల్లాపూర్ నుంచి తన స్వగ్రామం నార్లపూర్ కు తీసుకువెళ్లి దహన సంస్కారాలు […]

Read More
నార్లాపూర్ లో కరోనా పాజిటివ్​

నార్లాపూర్ లో కరోనా పాజిటివ్​

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో తొలి కరోనా కేసు నమోదైంది. మేడ్చల్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు తేలడంతో వైద్యసిబ్బంది హోం క్వారంటైన్​ ముద్రవేశారు. అయినప్పటికీ సదరు వ్యక్తి నార్లాపూర్ లో ఉన్న తన బంధువుల వద్దకు వెళ్లడంతో శుక్రవారం వారిని కూడా వైద్యపరీక్షల కోసం తీసుకెళ్లారు.

Read More