సామాజిక సారథి, పటాన్‌చెరు: రన్నింగ్ ఆర్టీసీ బస్సు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… లింగంపల్లి చౌరస్తా వద్ద ఓ వ్యక్తి ఒక్కసారిగా పటాన్‌చెరు వైపు నుండి మెహదీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెణక చక్రాల కింద పడుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి చాతి, మెడపై నుండి బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. […]
సామాజిక సారథి, చేగుంట: అన్నదాతలు అధైర్యపడొద్దు ప్రతి గింజ కొంటామని ఎమ్మెల్సీ ఫరక్ హుస్సేన్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులు, గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతి కోసం రూ. 2060 మద్దతు ధర కల్పిస్తున్నాడని […]
సామాజిక సారథి, నిజాంపేట్: జినేక్స్ సీడ్స్ కంపెనీ క్షేత్ర ప్రదర్శన రీజినల్ మేనేజర్ కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా కల్వకుంట గ్రామంలో జీనేక్స్ సీడ్స్ ఇండియా సౌజన్యంతో జీపీహెచ్ 699వరి రకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారుమడి సిద్ధం చేసుకునే ముందు మేలిమి రకాలతో నారు మడిని చేసుకున్నట్లయితే మంచి దిగుబడుతో పాటు అధిక లాభాలు అర్జించవచ్చన్నారు. కల్వకుంట గ్రామానికి చెందిన సంగారెడ్డి అను రైతు తనకున్న 12ఎకరాల్లో జిపిహెచ్ […]
సామాజిక సారథి, సిద్దిపేట: అనాధ వృద్ధులకు చేయూతనందిద్దామని బెజ్జంకి తహసీల్ధార్ విజయప్రకాశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ఎక్స్ రోడ్ వద్ద అనాధ వృద్ధులకు నిత్యవసర వస్తువులు, దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవం సందర్భంగా బాలవికాస సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాధ పిల్లలు, వికలాంగులు, వితంతువులు, వితంతువుల పిల్లల అభివృద్ధికి అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, వారికి ఆర్థికంగా తోడ్పాటును అందించడం అభినందనీయమన్నారు. బాలవికాస […]
– ఫార్మసీ విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఉద్బోధ సామాజిక సారథి, పటాన్‌చెరు: ఫార్మశీ విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణలో తమకున్న జ్ఞానాన్ని సమాజానికి పంచి, ప్రజలను చైతన్య వంతులుగా చేయాలని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ పిలుపునిచ్చారు. గీతం ఫార్మసీ విద్యార్థుల సంఘాన్ని (జీపీఎస్ఏ) గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, ఔషధ వినియోగం, వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు వంటి విషయాలను ఫార్మసీ విద్యార్థులు […]
సామాజికసారథి, శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన ముద్దగల్ల అంజయ్య కుమారుడు శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తనవంతు సహాయంగా తన సొంత డబ్బులు రూ.ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్ గాయపడటం బాధాకరమని, ఆయన కుటుంబానికి తామంతా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మ వెంకటేశ్, గ్రామ కమిటీ […]
ఆర్ఎస్ఎస్ మెదక్ విభాగ్ ప్రచార ప్రముఖ బండి వెంకటేశ్వర్లు సామాజిక సారథి, పెద్దశంకరంపేట: సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, ధర్మరక్షణ కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని ఆర్ఎస్ఎస్ మెదక్ విభాగ్ ప్రచార ప్రముఖ బండి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం నిర్వహించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవార్ జన్మదినాన్ని సైతం జరుపుకున్నారు. హిందూ సంఘటన ధ్యేయంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ […]
సామాజికసారథి, సిద్దిపేట: బహుజన రాజ్యాధికారం కోసం బహుజన సమాజ్‌పార్టీ(బీఎస్పీ) ఆధ్వర్యంలో జరిగే రాజ్యాధికార యాత్రలో యువత అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర చీఫ్కోఆర్డినేటర్డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. స్వేరో స్టూడెంట్ యూనియన్(ఎస్ఎస్యూ) ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ఆయన భారీ ర్యాలీగా భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని […]