ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైంది ఉద్యోగులు భయపడొద్దు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్జిల్లా జైలు నుంచి విడుదల సామాజిక సారథి, కరీంనగర్: ‘ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైంది. కేసీఆర్నీ గొయ్యి.. నువ్వే తవ్వుకుంటున్నావ్..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ సమాజాన్ని దోచుకుంటున్న సీఎం కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారు. వేల కోట్లు దోచుకుని అవినీతి కుబేరులుగా మారారని, ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా జైలుకు పంపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్అధికారంలో […]
విడుదల చేయాలని జైళ్లశాఖకు హైకోర్టు ఆదేశాలు రిమాండ్ రిపోర్టును తప్పుబట్టిన ఉన్నతన్యాయస్థానం కేసు విచారణను 7వ తేదీకి వాయిదా సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను విడుదల చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జ్యూడీషియల్ రిమాండ్ పై హైకోర్టు స్టే విధించింది. వ్యక్తిగత పూచీకత్తు, రూ.40వేల బాండ్ పై విడుదల చేయాలని జైళ్లశాఖ డీజీని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్ కు ఆదేశాలు […]
ఇచ్చిన హామీ మేరకు రైతులకు నగదు సీఎం కేసీఆర్‌చిత్రపటానికి మంత్రి గంగుల క్షీరాభిషేకం సామాజిక సారథి, కరీంనగర్: రైతులకు ఇచ్చిన మాట తప్పని సీఎం కేసీఆర్ తప్పలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా బుధవారం కరీంనగర్ లోని గోపాలపూర్‌లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వ రాబడులు తగ్గి ఇబ్బంది ఏర్పడినా.. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదని […]
వానాకాలం పంటను ఎందుకు కొనడం లేదు సీఎం, మంత్రుల భాష మార్చుకోవాలి బీజేపీ చీఫ్బండి సంజయ్‌ఫైర్ సామాజికసారథి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోమారు ధ్వజమెత్తారు. వర్షాకాలం పంట కొనబోమని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఎక్కడా చెప్పలేదన్నారు. వానాకాలం పంటను కొంటామని టీఆర్ఎస్పార్లమెంటరీ పక్షనేత నామా నాగేశ్వర్రావు ఎదుటే గోయల్ చెప్పారని వివరించారు. వానాకాలం పంటను సీఎం కేసీఆర్ ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనిపించడం […]
వీసీ ప్రొఫెసర్ ఎస్. మల్లేష్ సామాజిక సారథి, కరీంనగర్: జాతీయ సమైక్యత క్యాంపుకు శాతవాహన విశ్వవిద్యాలయం వాలింటీర్లు ఎంపికైనట్లు శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ ఈనెల 16 నుంచి 22 తేదీల్లో జరిగబోయే సాంస్కృతిక పోటీలకు బి. సంస్కృతి, ఓ. ప్రితి, వి. వాసవి, కె. శ్రీకాంత్, కె. రాము, కె. పూర్ణ, యు. ఆదిత్య, ఎస్. బిమల్, దీప్ కౌర్లు ఎంపికైనట్లు తెలిపారు. జాతీయ క్యాంపులో […]
సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందిరా నగర్ పోలింగ్ సెంటర్ ను కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. బీజేపీ అభ్యర్థి, మాజీమంత్రి ఈటల రాజేందర్, జమున దంపతులు కమలాపూర్ 262 పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం హుజురాబాద్ మండలం కందుగుల జడ్పీ హైస్కూలులో […]
సామాజిక సారథి, చొప్పదండి: నేటి యువతకు వివేకానందుడు ఆదర్శప్రాయుడని కరీంనగర్జిల్లా చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్, నెహ్రూ యువకేంద్ర జిల్లా కోఆర్డినేటర్ వెంకట్ రాంబాబు కొనియాడారు. నెహ్రూ యువకేంద్ర, నవతరం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా చొప్పదండిలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. […]
సామాజిక సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో జీవాలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. కురుమ సంఘం అధ్యక్షుడు ఏముండ్ల రాయుడు, బీరయ్య కాపరులకు అందజేశారు. కార్యక్రమంలో కేవైసీఎస్ రాష్ట్ర కార్యదర్శి పెద్ది వీరేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్, కురుమ సంఘం నాయకులు ఏముండ్ల రాజయ్య, ఓరుగుల తిరుపతి, రవి, కొమురెల్లి, నాగరాజు, వెంకటయ్య పాల్గొన్నారు.