Breaking News

ఆమె

For more related details

విశ్వసుందరిగా హర్నాజ్‌ సంధు

విశ్వసుందరిగా హర్నాజ్‌ సంధు

మిస్‌ యూనివర్స్‌గా పంజాబ్‌ సుందరి 21ఏళ్ల తర్వాత భారత యువతికి కిరీటం సుస్మితా సేన్‌, లారాదత్తా తర్వాత ఆమెకే న్యూఢిల్లీ: మిస్‌ యూనివర్స్‌ 2021 పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించిన 21 ఏళ్ల పంజాబ్‌ సుందరి హర్నాజ్‌ కౌర్‌ సంధు విజేతగా నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు విశ్వసుందరి కిరీటం వరించింది. ఈ ఏడాది ‘లివా మిస్‌ దివా యూనివర్స్‌’ కిరీటాన్ని సొంతం చేసుకోవడంతో హర్నాజ్‌కు ‘మిస్‌ యూనివర్స్‌ 2021’లో భారత్‌ తరఫున […]

Read More
స్కౌట్స్, గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా కవిత

స్కౌట్స్, గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా కవిత

హైదరాబాద్​: స్కౌట్స్, గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా రెండోసారి ఎమ్మెల్సీ కవిత ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లోని స్కౌట్స్, గైడ్స్‌ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత ఘన విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ మంచాల వరలక్ష్మి ప్రకటించారు. 2015లో తొలిసారి స్కౌట్స్, గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా విజయం సాధించారు.

Read More
పాక్ జలసంధిని ఈదేశారు..

పాక్ జలసంధిని ఈదేశారు..

హైదరాబాద్​: హైదరాబాద్‌కు చెందిన జి.శ్యామల(47) అరుదైన రికార్డును నెలకొల్పారు. శ్రీలంక నుంచి ఇండియా మధ్యలో ఉన్న 30 కి.మీ. పాక్ జలసంధిని ఈజీగా ఈదేశారు. ఈ రికార్డు సాధించిన తొలి తెలుగు మహిళగా, ప్రపంచంలోని రెండో మహిళగా గుర్తింపుపొందారు. శుక్రవారం ఉదయం 4.15 గంటలకు శ్రీలంక తీరం నుంచి ప్రారంభమై 13 గంటల 43 నిమిషాల పాటు నిరంతరంగా ఈదుతూ రామేశ్వరంలోని ధనుష్కోడికి చేరుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది వద్ద శ్యామల శిక్షణ పొందుతున్నారు. […]

Read More
అన్నదాతకు అండగా.. సేవే నిండుగా

అన్నదాతకు అండగా.. సేవే నిండుగా

సారథి న్యూస్, ములుగు: ఆమె ఓ ప్రభుత్వ అధికారిణి, ఆకుపచ్చ పెన్నుతో సంతకం చేసేంత హోదా, హలం పట్టి పొలంలో పనులు చేసేంత ఓపిక, రెండు జిల్లాలకు సబ్ రిజిస్ట్రార్ ఆమె.. క్షణం తీరిక లేకుండా తన విధి నిర్వహణలో బిజీగా గడిపే ఓ ఉత్తమ ఆఫీసర్​.. కానీ సెలవు దినాల్లో మాత్రం సేద్యం పనులు చేస్తుంటారు. ఎందుకో తెలుసా.. కర్షకుల విలువ ప్రపంచానికి చెప్పడానికే. ఆమె ఎవరో కాదు.. ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ […]

Read More
స్తంభాలు ఎక్కగలం.. కొలువు కొట్టగలం

స్తంభాలు ఎక్కగలం.. కొలువు కొట్టగలం

దేశంలోనే తొలి లైన్​ఉమెన్​గా భారతి, శిరీష ఎంపిక రిటన్ ​టెస్ట్, పోల్ ​టెస్ట్​లోనూ పాస్​.. గవర్నర్​తమిళిసై సౌందరరాజన్‌ ప్రత్యేక అభినందనలు పుట్టి పెరిగింది మారుమూల పల్లెటూరులోని పేదింటి కుటుంబం. అవకాశాలు అంతంత మాత్రమే. కష్టపడితే అసాధ్యమేది కాదని నిరూపించారు ఆ ఇద్దరు యువతులు. అవరోధాలను అధిగమించి తమ కలల కొలువును సాధించారు. అంతే కాదోండయ్​.. దేశంలోనే ప్రప్రథమంగా విద్యుత్​శాఖలో లైన్​ ఉమెన్​గా ఉద్యోగం సంపాదించి అందరి చేత శభాష్ ​అనిపించుకున్నారు. ఆ మహిళా మణులు ఎవరో కాదు.. […]

Read More
ఎవరికీ పట్టని వారియర్స్ బాధలు

ఎవరికీ పట్టని వారియర్స్ బాధలు

కరోనా మహమ్మారి భయానికి దేశమంతట తలుపులకు గొళ్లాలుపడ్డాయి. వైరస్​కోరలకు తామెక్కడ చిక్కుకోవాల్సి వస్తుందోనని ఇరుగుపొరుగుతో బంధాలు తెంచుకున్నాయి. కానీ, ఆరోగ్య కార్యకర్తలు మాత్రం మహమ్మారి సైరన్​దేశంలో మోగడంతోనే గడపదాటారు. ఇంట్లోని పిల్లాజల్లా వద్దని వాదించినా దేశమంతా లాక్​డౌన్​లో ఉంటే వీళ్లు మాత్రం ప్రాణాలకు తెగించి రోడ్డెక్కారు. ముఖ్యంగా మహిళలు పేగులు మెలిపెట్టే నెలసరి నొప్పులు, దీర్ఘకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యలను లెక్కచేయకుండా కరోనా కట్టడికి అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఏ మాత్రం అలుపెరగకుండా కరోనాతో కంటికి కనిపించని […]

Read More
కరోనా తెచ్చిన ఆకలి కేకలు

కరోనా తెచ్చిన ఆకలి కేకలు

బతకడానికి పనిచేయడం మాత్రమే ఆస్తిగా ఉన్న జీవితాలు వాళ్లవి. చదువులూ, సంపదలూ లేకున్నా ఎలాగైనా బతకగలమనే నమ్మకమే వాళ్లను ఇన్నాళ్లూ నడిపించింది. ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ను నమ్ముకుని ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న తల్లులు వాళ్లు. ఇప్పుడా ఆత్మవిశ్వాసం మీదే దెబ్బపడింది. ఎలాగైనా బతకగలం అనే నమ్మకం సడలిపోతోంది. చేయడానికి పనిలేకుంటే తినడానికి తిండీ ఉండదన్న నిజానికి సాక్ష్యంగా ఇప్పుడు ఆకలిని, ఆశలను ఎలా తీర్చుకోవాలో అర్థం కాకుండా నిలబడ్డారు. కరోనా వాళ్ల శరీరాలను తాకకుండానే జీవితాలని దెబ్బతీసింది. శక్తి […]

Read More
నెలకు రూ.75 జీతం.. మురిసిపోయా

నెలకు రూ.75 జీతం.. మురిసిపోయా

విజయం ఎప్పుడూ వెంటనే వరించదు. తన కోసం తపించే వారి మనసును పరీక్షిస్తుంది. అడ్డంకులను సృష్టించి, కష్టాలను కలిగిస్తుంది. అవకాశాలను చేజారుస్తుంది. వాటన్నింటినీ తట్టుకుని, కష్టాల కన్నీటిని అదిమిపట్టి, ఎంత కష్టమొచ్చినా ఎదిరించి నిలిచిన వారికే అది వరమవుతుంది. 14 ఏళ్ల వయస్సులో బడిలో ఉండాల్సిన అమ్మాయి పెళ్లి పీటల మీద కూర్చుంది. 23 ఏళ్లకే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఏదైనా ఉద్యోగం చేయాలనే తండ్రి కలను నెరవేర్చింది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంచెలంచెలుగా […]

Read More