హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన జి.శ్యామల(47) అరుదైన రికార్డును నెలకొల్పారు. శ్రీలంక నుంచి ఇండియా మధ్యలో ఉన్న 30 కి.మీ. పాక్ జలసంధిని ఈజీగా ఈదేశారు. ఈ రికార్డు సాధించిన తొలి తెలుగు మహిళగా, ప్రపంచంలోని రెండో మహిళగా గుర్తింపుపొందారు. శుక్రవారం ఉదయం 4.15 గంటలకు శ్రీలంక తీరం నుంచి ప్రారంభమై 13 గంటల 43 నిమిషాల పాటు నిరంతరంగా ఈదుతూ రామేశ్వరంలోని ధనుష్కోడికి చేరుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది వద్ద శ్యామల శిక్షణ పొందుతున్నారు. ఆయన 2012లోనే పాక్ జలసంధిని 12.30 గంటల వ్యవధిలో ఈదేశారు. కొన్నేళ్ల క్రితం నుంచే శిక్షణ తీసుకుంటున్నానని, ఆత్మవిశ్వాసంతో విజయవంతంగా గమ్యాన్ని పూర్తిచేసినట్లు శ్యామల తెలిపారు.
- March 20, 2021
- Archive
- ఆమె
- HYDERABAD
- rajivthrivei
- shyamala
- SWIMMING
- జి.శ్యామల
- తెలంగాణ
- రాజీవ్ త్రివేది
- స్విమ్మింగ్
- హైదరాబాద్
- Comments Off on పాక్ జలసంధిని ఈదేశారు..