
- నాగర్ కర్నూల్ జిల్లాలో దుర్ఘటన
- వనపట్లలో తీవ్ర విషాదఛాయలు
సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ మండలం పరిధిలోని వనపట్లలో ఆదివారం రాత్రి ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన తల్లి, పిల్లలు నలుగురు మృతిచెందారు. స్థానికుల కథనం.. గ్రామానికి చెందిన గొడుగు పద్మ (26), భర్త భాస్కర్.. ఇద్దరు కూతుళ్లు పప్పి(6), వసంత(6), కుమారుడు విక్కి(7నెలలు)తో నివాసం ఉంటున్నారు. భాస్కర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే తిని ఇంట్లో పడుకున్నారు. ఆదివారం కురిసిన వర్షానికి అర్ధరాత్రి ఇంటి పైకప్పు కూలి తల్లి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు అక్కడికి అక్కడే మృతిచెందారు. తండ్రి భాస్కర్ పరిస్థితి విషమంగా ఉండడంతో నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుబంలో నలుగురు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటన స్థలానికి నాగర్ కర్నూల్ పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో ఊరుఊరంతా ఘొల్లున ఏడ్చుతున్నారు.
