Breaking News

Day: October 30, 2020

‘పంజాబ్’​ దూకుడుకు బ్రేక్​

‘పంజాబ్’​ దూకుడుకు బ్రేక్​

అబుదాబి: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన 50వ మ్యాచ్​లో కింగ్స్​ ఎలెవన్​పంజాబ్​పై రాజస్తాన్​రాయల్స్​7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదు మ్యాచ్​లు గెలిచిన పంజాబ్ ​దూకుడుకు బ్రేక్​ పడినట్లయింది. రాజస్తాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్​చేసిన కింగ్స్‌ పంజాబ్‌ 186 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. క్రిస్‌ గేల్‌ (99; 63 బంతుల్లో 4×6, 6×8), కేఎల్‌ రాహుల్‌ (46;41 బంతుల్లో 4×3, 6×2) రాణించడంతో పాటు పూరన్‌(22; […]

Read More
ఎవరికీ పట్టని వారియర్స్ బాధలు

ఎవరికీ పట్టని వారియర్స్ బాధలు

కరోనా మహమ్మారి భయానికి దేశమంతట తలుపులకు గొళ్లాలుపడ్డాయి. వైరస్​కోరలకు తామెక్కడ చిక్కుకోవాల్సి వస్తుందోనని ఇరుగుపొరుగుతో బంధాలు తెంచుకున్నాయి. కానీ, ఆరోగ్య కార్యకర్తలు మాత్రం మహమ్మారి సైరన్​దేశంలో మోగడంతోనే గడపదాటారు. ఇంట్లోని పిల్లాజల్లా వద్దని వాదించినా దేశమంతా లాక్​డౌన్​లో ఉంటే వీళ్లు మాత్రం ప్రాణాలకు తెగించి రోడ్డెక్కారు. ముఖ్యంగా మహిళలు పేగులు మెలిపెట్టే నెలసరి నొప్పులు, దీర్ఘకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యలను లెక్కచేయకుండా కరోనా కట్టడికి అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఏ మాత్రం అలుపెరగకుండా కరోనాతో కంటికి కనిపించని […]

Read More
పుస్తెమట్టెల అందజేత

పుస్తెమట్టెల అందజేత

సారథి న్యూస్, రామాయంపేట: నిజాంపేట మండలంలోని నందగోకుల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన దొరలగల్ల యాదయ్య కూతురు పెళ్లికి నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ శుక్రవారం పుస్తెమట్టెలు అందజేశారు. కార్యక్రమంలో నార్లపూర్ ఎంపీటీసీ సభ్యుడు రాజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గురుగల శ్రీనివాస్, నిజాంపేట ఉపసర్పంచ్ కొమ్మట బాబు పాల్గొన్నారు.

Read More
వడ్ల కొనుగోళ్లు షురూ

వడ్ల కొనుగోళ్లు షురూ

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్, రాంపూర్, చల్మేడ గ్రామాల్లో శుక్రవారం రామాయంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు సెంటర్లను చైర్మన్ బాదె చంద్రం, నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు కలసి ప్రారంభించారు. రైతులు ఈ కొనుగోలు సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘ఏ’ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868 కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఈవో నర్సింలు, సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు గౌస్, […]

Read More
‘ధరణి’ పూర్తిగా పారదర్శకం

‘ధరణి’ పూర్తిగా పారదర్శకం

ఒక క్లిక్​తో భూముల వివరాలను ఎక్కడైనా చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 నిమిషాల్లోనే పూర్తి సబ్ రిజిస్ట్రార్ ​ఆఫీసులుగా తహసీల్దార్ కార్యాలయాలు పాత రిజిస్ట్రేషన్ చార్జీలే వర్తిస్తాయి.. ‘ధరణి’ పోర్టల్ ​ప్రారంభంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఎంతో శ్రమించి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పూర్తి పారదర్శకంగా ఉంటుందని, 1,45,58,000 ఎకరాల భూములు ఇందులో దర్శనమిస్తున్నాయని సీఎం కె.చంద్రశేఖరావు అన్నారు. భూముల వివరాలను దేశవిదేశాల్లో ఉన్న వారు ఎవరైనా చూసుకోవచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న […]

Read More