Breaking News

Day: January 10, 2021

‘చలో కలెక్టరేట్’ వాయిదా

‘చలో కలెక్టరేట్’ వాయిదా

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: వంగూరు మండలం డిండిచింతపల్లికి చెందిన నిరుద్యోగ పట్టభద్రుడు, గురుకుల పూర్వవిద్యార్థి సూగూరు రామచంద్రం హోటల్​ను కూల్చివేసిన దుండగులను శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ జనవరి 11న నిర్వహించతలపెట్టిన ‘చలో కలెక్టరేట్’​ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జైభీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాజంలోని అన్నివర్గాలు, సామాజిక ఉద్యమ సంఘాల మద్దతును దృష్టిలో ఉంచుకుని, అందరినీ కలుపుకుని ఈ పోరాటాన్ని ముందుకు […]

Read More
ముదిరాజ్​కులస్తుల అభ్యున్నతికి కృషి

ముదిరాజ్ ​కులస్తుల అభ్యున్నతికి కృషి

సారథి న్యూస్, హైదరాబాద్: ముదిరాజ్ కులస్తుల సమస్యలు పరిష్కరించి, వారి అభ్యున్నతికి కృషిచేస్తానని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ​స్పష్టంచేశారు. హైదరాబాద్​లోని కోకాపేట్​లో ముదిరాజ్​కులస్తులకు ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలంలో నిర్మించనున్న భవన నిర్మాణానికి ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. స్థలం కేటాయించినందుకు సీఎంకు కృతజ్క్షతలు తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ముదిరాజ్ కులస్తులు లేని ఊరు, చేప తిననివారు లేరని వివరించారు. […]

Read More
కొమురెల్లి.. ప్రణమిల్లి

కొమురెల్లి.. ప్రణమిల్లి

వైభవంగా కోరమీసాల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి సారథి న్యూస్, హుస్నాబాద్: భక్తుల కొంగు బంగారమైన కొమురవెళ్లి మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముక్కోటి దేవతలు, పంచభూతల సాక్షిగా, వేలాది భక్తుల మధ్య వీరశైవ పండితుల మంత్రోచ్ఛరణ కొమురవెల్లి మల్లికార్జునస్వామి, కేతలమ్మ, బలిజ మేడలదేవిని వివాహమాడారు. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులుఅంగరంగ వైభవంగా నిర్వహించే మల్లన్న కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారికి […]

Read More
కోరమీసాల మల్లన్నకోటి దండాలు

కోరమీసాల మల్లన్న కోటి దండాలు

కొమురెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం 13 వారాల పాటు జానపదుల జనజాతర సారథి న్యూస్, హుస్నాబాద్: తెలంగాణ, జానపద సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచి.. అరుదైన పడమటి శివాలయంగా పేరొందిన కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మెత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏటా మార్గశిరమాసం చివరి ఆదివారం నిర్వహించే స్వామివారి కల్యాణ వేడుకతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. జనవరి 10న ప్రారంభమయ్యే ఉత్సవాలు మూడు నెలల పాటు 13వారాలు కొనసాగి ఫాల్గుణ మాసం ఆదివారం ఏప్రిల్ 11న అగ్నిగుండాల కార్యక్రమంతో […]

Read More
విద్యతోనే వికాసం.. విజయం

విద్యతోనే వికాసం.. విజయం

సారథి న్యూస్, అలంపూర్: విద్యతోనే వికాసం.. విజయం సాధ్యమని ఫిట్​ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్​ఆర్ఎస్​ప్రసన్నకుమార్​అన్నారు. సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల్లో ఆ రెండు సాధ్యమవుతున్నాయని చెప్పారు. విద్య లేకుంటే సమాజంలో గౌరవం ఉండదని, సమాజ స్థితిగతులు తెలియవని వివరించారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో జనవరి 13,14వ తేదీల్లో జరిగే స్వేరో సంబరాల ప్రచార కార్యక్రమంలో భాగంగా శాంతినగర్ లో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. గురుకులాల్లో చదువుతున్న పిల్లలు విద్య, సాంకేతికపరంగా ముందుకు దూసుకెళ్తున్నారంటే అది డాక్టర్​ […]

Read More
స్తంభాలు ఎక్కగలం.. కొలువు కొట్టగలం

స్తంభాలు ఎక్కగలం.. కొలువు కొట్టగలం

దేశంలోనే తొలి లైన్​ఉమెన్​గా భారతి, శిరీష ఎంపిక రిటన్ ​టెస్ట్, పోల్ ​టెస్ట్​లోనూ పాస్​.. గవర్నర్​తమిళిసై సౌందరరాజన్‌ ప్రత్యేక అభినందనలు పుట్టి పెరిగింది మారుమూల పల్లెటూరులోని పేదింటి కుటుంబం. అవకాశాలు అంతంత మాత్రమే. కష్టపడితే అసాధ్యమేది కాదని నిరూపించారు ఆ ఇద్దరు యువతులు. అవరోధాలను అధిగమించి తమ కలల కొలువును సాధించారు. అంతే కాదోండయ్​.. దేశంలోనే ప్రప్రథమంగా విద్యుత్​శాఖలో లైన్​ ఉమెన్​గా ఉద్యోగం సంపాదించి అందరి చేత శభాష్ ​అనిపించుకున్నారు. ఆ మహిళా మణులు ఎవరో కాదు.. […]

Read More
ఇండిపెండెంట్ డబుల్ ఇళ్లకు రూ.5లక్షల సాయం

ఇండిపెండెంట్ ‘డబుల్’ ఇళ్లకు రూ.5లక్షల సాయం

సారథి న్యూస్, రామయంపేట: రాబోయే రోజుల్లో ఇల్లు లేక సొంత జాగా కలిగి ఉన్న వారికి రూ.ఐదు లక్షల వ్యయంతో నిర్మించబోయే డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల నిర్మాణంలో కె.వెంకటాపూర్ కే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంపేట మండలంలోని కె.వెంకటాపూర్ గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో భక్తిభావం విరసిల్లాలని ఆమె అన్నారు. అలాగే అలయ అభివృద్దికి తన సహాయ […]

Read More