హైదరాబాద్: స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా రెండోసారి ఎమ్మెల్సీ కవిత ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లోని స్కౌట్స్, గైడ్స్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత ఘన విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ మంచాల వరలక్ష్మి ప్రకటించారు. 2015లో తొలిసారి స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా విజయం సాధించారు.
హైదరాబాద్: ప్రతిఒక్కరూ మాస్క్‌ను ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనను శుక్రవారం నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, కోర్టులో హాజరుపర్చాలని సూచించింది. విపత్తు నిర్వహణచట్టంతో పాటుగా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేయాలని పోలీసులను ఆదేశించింది.
వరంగల్‌లో మిన్నంటిన నిరసనలు.. కాకతీయ యూనివర్సిటీలో ఆందోళనలు సారథి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీచేయడం లేదని మనస్తాపం చెంది గతనెల 26న పురుగు మందు తాగిన కేయూ విద్యార్థి బోడ సునీల్ నాయక్ శుక్రవారం నిమ్స్‌లో చికిత్సపొందుతూ మృతి చెందాడు. వారం రోజులుగా ప్రాణాలతో పోరాడిన సునీల్ చివరకు మృత్యుఒడికి చేరుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన ఓ నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టాడు. పట్టుదలతో చదివి జన్మించాడు. […]
సారథి, రామడుగు: రామడుగు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చొప్పదండి సీఐ నాగేశ్వర్ రావును ఘనంగా సన్మానించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలసి మండలంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఐ సమస్యల పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వంచే రాజిరెడ్డి, గౌరవాధ్యక్షుడు గంటే భాస్కర్, ప్రధాన కార్యదర్శి కాసరపు తిరుపతి గౌడ్, సభ్యులు […]