సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ లండన్‌లో గ్రీన్ యాపిల్ అవార్డులను అందుకున్నారు. మొజాంజాహీ మార్కెట్, సచివాలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదగిరిగుట్ట దేవాలయానికి గ్రీన్ యాపిల్ అవార్డులు వచ్చాయి. ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్లింగ్స్ క్యాటగిరీలో ఈ అవార్డులు లభించాయి. దేశంలోని నిర్మాణాలు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోనుండడం ఇదే తొలిసారి కాగా, ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో […]
– లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ– వీసీ ఇంట్లో 8 గంటల పాటు సోదాలు– పలు కీలకపత్రాలు స్వాధీనం.. అనంతరం అరెస్ట్ సామాజికసారథి, హైదరాబాద్: నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ దాచేపల్లి రవీందర్ గుప్తాను ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో దాదాపు 8గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం రవీందర్ గుప్తాను అరెస్టు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని భీమ్‌గల్‌లో […]
– 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు– అధికారులతో స్పీకర్ పోచారం సమీక్ష సామాజికసారథి, హైదరాబాద్: ఈ నెల 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరిగేందుకు ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్‌శాఖ అధికారులతో శాసనసభలో బుధవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, […]
సామాజిక సారధి , నాగర్ కర్నూల్ : కొత్త ప్రియుడు మోజులో పాత ప్రియుడునీ నెత్తిన బండరాయితో కొట్టి చంపేసిన సంఘటనలో ఇద్దరినీ మంగళవారం రిమాండ్ కు తరలించినట్లు సీఐ జక్కుల హనుమంతు తెలిపారు . ఈనెల 16వ తేదీ నా బిజినపల్లి మండల పరిధిలోని వట్టెం గ్రామంలో చింతల కృష్ణమ్మ అనే మహిళకు గత కొన్ని లనుండి రవికుమార్ తో పరిచయం ఏర్పడి ఇద్దరు సహజీవనం చేసుకుంటూ అదే గ్రామంలో నివసిస్తున్నారు . ఇటీవల కొంత […]
సామాజిక సారథి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని మూడవ అంతస్తులో టాక్స్ సెక్షన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్యాలయమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. భారీగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో కార్యాలయంలోని పలు ఫైల్స్దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో లిప్ట్ నిలిచి పోవడంతో అందులో ఉన్నవారు ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది […]
నేడు హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు మూడు కమిషనరేట్ల పరిధిలో ఫ్లై ఓవర్ల మూసివేత మద్యం తాగి పట్టుబడితే వాహనాలు సీజ్ సామాజికసారథి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ల పరిధిలో ఇవి అమల్లో ఉంటాయని ప్రకటించారు. డిసెంబర్ 31 రాత్రి 11 నుంచి జనవరి 1 ఉదయం 5గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని […]
న్యూఇయర్ వేడుకలపై పోలీస్ ఆంక్షలు స్థానికులకు ఇబ్బంది కలిగించినా చర్యలు తాగి రోడ్లపై హంగామా చేస్తే కటకటాలే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరిక సామాజికసారథి, హైదరాబాద్: డిసెంబర్ 31 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైన్ షాపులు, పబ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇస్తే.. మరోవైపు హైదరాబాద్ పోలీసులు మాత్రం న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ పోలీస్ కొత్త బాస్ సీవీ ఆనంద్ ఒక ప్రకటన […]
నగర శివార్లలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా వార్షిక నివేదికను ఆవిష్కరించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్ సామాజికసారథి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నాలుగు శాతం నేరాలు పెరిగాయి. అలాగే పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలో కేసుల సంఖ్య పెరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాలు చేసిన […]