సారథి న్యూస్, ములుగు: తరచూ సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండే ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కు అరుదైన గుర్తింపు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన ఇంద్రోజిర రమేష్ అనే యువకుడు మంగళవారం ఆమె ఫొటోలతో కూడిన జ్ఞాపికను అందజేశాడు. తస్లీమా రైతు ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు సెలవు రోజుల్లోనూ వ్యవసాయ పనులు చేస్తూ.. నిరుపేదలకు చేయూతనందిస్తూ.. అనాథలు, అభాగ్యుల ఆకలి తీరుస్తుంటారు. ఈ విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న […]
సారథి న్యూస్, ములుగు: ఆమె ఓ ప్రభుత్వ అధికారిణి, ఆకుపచ్చ పెన్నుతో సంతకం చేసేంత హోదా, హలం పట్టి పొలంలో పనులు చేసేంత ఓపిక, రెండు జిల్లాలకు సబ్ రిజిస్ట్రార్ ఆమె.. క్షణం తీరిక లేకుండా తన విధి నిర్వహణలో బిజీగా గడిపే ఓ ఉత్తమ ఆఫీసర్.. కానీ సెలవు దినాల్లో మాత్రం సేద్యం పనులు చేస్తుంటారు. ఎందుకో తెలుసా.. కర్షకుల విలువ ప్రపంచానికి చెప్పడానికే. ఆమె ఎవరో కాదు.. ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ […]
తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్నే మార్చేసింది ఇదే స్ఫూర్తితో తుపాకులగూడెం, దుమ్ముగూడెం పనులు కాళేశ్వరం పర్యటనలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ముక్తేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు సారథి న్యూస్, భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో ఆశించిన రీతిలో పూర్తయి నీటి పంపింగ్ కూడా నిరాటంకంగా సాగుతోందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తికావడంలో కృషిచేసిన నీటిపారుదల శాఖాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను ఆయన అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన […]
సారథి న్యూస్, ములుగు: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారిని 15 రోజుల వరకు క్వారంటైన్లో ఉంచాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణాఆదిత్య సూచించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ములుగు, భూపాలపల్లి జిల్లాల వైద్యాశాఖ అధికారులతో కోవిడ్ -19 వాక్సిన్ పై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీహెచ్‌సీల్లో […]