Breaking News

LOCKDOWN

పశ్చిమబెంగాల్ లో లాక్డౌన్?

పశ్చిమబెంగాల్ ​లో లాక్​డౌన్?

కోల్‌కతా: కరోనా నయా వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నాయి. జనం పెద్దఎత్తున గుమికూడడం, సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ మరో అడుగు ముందుకేసింది. దాదాపు లాక్‌డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, వినోద పార్కులను జనవరి 3 నుంచి మూసివేస్తున్నట్లు […]

Read More
పేదలకు అన్నదానం

పేదలకు అన్నదానం

సారథి, వేములవాడ: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పేదలు ఆకలితో అల్లాడుతున్నారు. దీంతో పేదలు, కూలీలు, యాచకులు ఆకలితో అలమటించకూడదని టీఆర్ కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నారు. మంగళవారం 32వ రోజు పేదలకు ఆహారం అందజేశారు. పేదల కోసం శ్రమిస్తున్న మొట్టల మహేష్ కుమార్, ట్రస్ట్ సభ్యులు, వర్కింగ్ టీంలకు పలువురు ధన్యవాదాలు తెలిపారు.

Read More
సరుకులు పంపిణీ

పేదలకు సరుకులు పంపిణీ

సారథి, చొప్పదండి: కరోనా విజృంభణ.. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకూడదని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో పేద కుటుంబాలకు సోమవారం టీఆర్ఎస్ నాయకులు మచ్చ రమేష్, మిత్రుల సహకారంతో 25కేజీల బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాళ్లపల్లి రవి, తాల్లపల్లి కరుణాకర్, దూస మురళి, దూస సతీష్, ఎనగందుల సాయికుమార్, తమ్మడి సంతోష్ పాల్గొన్నారు.

Read More
టీఆర్ కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

టీఆర్ కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

సారథి, వేములవాడ: కరోనా విజృంభిస్తున్న సమమయంలో పేదలు ఆకలితో అలమటించకూడదని టీఆర్ కే ట్రస్ట్ అధినేత తోట రాంకుమార్ ముందుకొచ్చి అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం లాక్ డౌన్ ముగిసేవరకు కొనసాగుతుందని తెలిపారు. ఎంక్వయిరీ టీంసభ్యులు కూడా అన్నివేళలా సహకరిస్తున్నారని ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ అన్నారు.

Read More
జూన్ 15 దాకా లాక్ డౌన్

జూన్ 10 దాకా లాక్ డౌన్.. టైం మినహాయింపు

సారథి ప్రతినిధి, హైదరాబాద్: కొవిడ్ ఉధృతి నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ను ప్రభుత్వం పదిరోజుల పాటు అనగా.. జూన్ 10వ తేదీ వరకు పొడిగించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మినహాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఆదివారం ప్రగతి భవన్ లో జరిగింది. సమావేశానికి రాష్ట్రమంత్రులు హాజరయ్యారు. లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు […]

Read More
అన్నదానం గొప్పకార్యం

అన్నదానం గొప్పకార్యం

సారథి, వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల లాక్ డౌన్ విధించడంతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు నిత్యన్నదాన కార్యక్రమాలు నిలిచిపోయాయి. నిత్యన్నదానం పై ఆధారపడి కడుపు నింపుకునే పేదలు, యాచకులు ఆకలితో విలవిల్లాడుతున్న నేపథ్యంలో శనివారం 250 మందికి జిల్లా ఎస్పీ రాహుల్ హేగ్డే పండ్లు, పౌష్టికాహారం ఆహారం అందజేసి వారిని అభినందించారు. తిండి లేక ఇబ్బంది పడుతున్న వారికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎవరూ […]

Read More
ఎడ్లబండ్లపై బండ్లపాడుకు ఎమ్మెల్యే సీతక్క

ఎడ్లబండ్లపై బండ్లపాడుకు ఎమ్మెల్యే సీతక్క

సారథి, ములుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం అడవి రంగాపుర్(నారాయణ పూర్)గ్రామంలోని బండ్లపాడు కోయగూడెంలో శనివారం ఎమ్మెల్యే సీతక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఆదుకోకపోవడం దారుణమన్నారు. ఊరికి దూరంగా అడవినే నమ్ముకొని బతుకుతున్న కోయగూడెం ప్రజలకు నెలకు రూ.6వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఫౌంహౌస్ ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు రావాలన్నారు. కరోనా గ్రామాలకు కూడా విస్తరించి ప్రాణాలు కోల్పోతున్నారని, టెస్టుల సంఖ్య […]

Read More
లాక్ డౌన్ అమలును పరిశీలించిన డీజీపీ

లాక్ డౌన్ ను పరిశీలించిన డీజీపీ

సారథి ప్రతినిధి, రంగారెడ్డి: డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్, అదనపు సీపీ సుధీర్ బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీతిసింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ సీఐ స్వామి రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కొత్తగూడెం చౌరస్తా 65వ జాతీయ రహదారిపై లాక్ డౌన్ సందర్భంగా ఏర్పాటుచేసిన చెక్ పోస్టును పరిశీలించారు. పోలీసు అధికారులకు భద్రతాపరమైన సూచనలు చేశారు. చెక్ పోస్ట్ వద్ద సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అందుకు […]

Read More