Breaking News

Day: January 24, 2021

‘పరిహారం ఇవ్వకుండా..పైప్​లైన్​వేయొద్దు’

‘పరిహారం ఇవ్వకుండా.. పైప్​లైన్​ వేయొద్దు’

సారథి న్యూస్, మానవపాడు: పరిహారం ఇవ్వకుండా తమ పొలాల గుండా హెచ్​పీసీఎల్​ గ్యాస్ ​పైప్​లైన్​వేయొద్దని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. తగిన పంట నష్టపరిహారం ఇవ్వకుండా కోర్టు నోటీసులు పంపించి దౌర్జన్యంగా పైప్​లైన్​ వేయడం ఏమిటని ప్రశ్నించారు. మిరప పంట, పత్తి పనులు పూర్తయ్యే వరకు సమయం ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

Read More
రామాలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ

రామాలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ

సారథి న్యూస్, మెదక్: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి హిందువులే కాదు ముస్లింలు సైతం విరాళాలు అందిస్తున్నారు. ఆదివారం మండల కేంద్రమైన కొల్చారం గ్రామంలో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన సుమారు 20 మంది ముస్లింలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమవంతు విరాళాలు అందజేయడం విశేషం. కార్యక్రమంలో ముస్లిం నాయకులు మహమ్మద్, అక్రం, ఖదీర్, ఇసాక్, మహమ్మద్ సమీర్, మౌలానా, హర్షద్, అహమ్మద్, ఇమ్రాన్, రామమందిర నిర్మాణ తీర్థ ట్రస్ట్ […]

Read More
మార్కెటింగ్​శాఖ మరింత బలోపేతం

దేశానికే తెలంగాణ రోల్ మోడల్

Further strengthen the marketing department మార్కెటింగ్​శాఖ మరింత బలోపేతం వ్యవసాయశాఖ పొలం.. హలం శాఖగా మారాలి రైతు వేదికలను వాడుకలోకి తీసుకురావాలి పంటసాగు విధానంలో మార్పు రావాలి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖాధికారులతో సీఎం కేసీఆర్​ సమావేశం సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గుర్తుచేశారు. వ్యవసాయశాఖ కాగితం కలం శాఖగా కాకుండా పొలం.. హలం శాఖగా […]

Read More
అన్నదాతకు అండగా.. సేవే నిండుగా

అన్నదాతకు అండగా.. సేవే నిండుగా

సారథి న్యూస్, ములుగు: ఆమె ఓ ప్రభుత్వ అధికారిణి, ఆకుపచ్చ పెన్నుతో సంతకం చేసేంత హోదా, హలం పట్టి పొలంలో పనులు చేసేంత ఓపిక, రెండు జిల్లాలకు సబ్ రిజిస్ట్రార్ ఆమె.. క్షణం తీరిక లేకుండా తన విధి నిర్వహణలో బిజీగా గడిపే ఓ ఉత్తమ ఆఫీసర్​.. కానీ సెలవు దినాల్లో మాత్రం సేద్యం పనులు చేస్తుంటారు. ఎందుకో తెలుసా.. కర్షకుల విలువ ప్రపంచానికి చెప్పడానికే. ఆమె ఎవరో కాదు.. ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ […]

Read More
శ్రీరామ నిధి సేకరణ

శ్రీరామ నిధి సేకరణ

సారథి న్యూస్, రామయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీరామ నిధిని సేకరించారు. కార్యక్రమంలో ఆకుల రమేష్, ఆకుల రాజు, ఎడ్ల నరసింహారెడ్డి, బుచ్చనరేష్, సంతోష్, ఆకుల భాను తదితరులు పాల్గొన్నారు. అలాగే నిజాంపేట పట్టణంలో జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ రూ.21,116 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర మెదక్ జిల్లా సంయోజక్ పబ్బా సత్యనారాయణ, రామాయంపేట ఖండ […]

Read More
నవోదయ ఉపాధ్యాయుడికి గౌరవ పురస్కారం

నవోదయ ఉపాధ్యాయుడికి గౌరవ పురస్కారం

సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ​జిల్లా వట్టెం నవోదయ విద్యాలయంలో తెలుగు ఉపాధ్యాయుడు శేషం సుప్రసన్నాచార్యులుకు కర్ణాటకలోని విజయనగరం విరూపాక్ష స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం జరిగిన ప్రతిష్ఠాత్మక జాతీయ సంగీత నృత్య సాహిత్య కార్యక్రమంలో సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు గౌరవ పురస్కారం ప్రదానం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ​కోలా వేంకటేశ్వర్​రావు మాట్లాడుతూ.. సుప్రసన్నాచార్యులు బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు సాహిత్యంలో విశేషకృషి చేశారని, పద్యకవిత వచనకవితా ప్రక్రియల్లో కవితారచన చేయడంలో సవ్యసాచి అని కొనియాడారు. […]

Read More