– కలకలం రేపుతున్న ఫోర్జరీ సంతకాలు– లింగసానిపల్లి నల్లవాగు భూమిల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు– ఒకే వ్యక్తి 34 ప్లాట్లు అసైన్ మెంట్ చేసినట్లు వెలుగులోకి– గ్రామపంచాయతీ స్టాంపులు, సంతకాల నకిలీ– పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసిన పంచాయతీ కార్యదర్శి సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: జిల్లా కేంద్రంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతో సమీప గ్రామాల్లో రియల్ భూమ్ కు రెక్కలొచ్చాయి. అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతూ ప్రభుత్వ భూములను కబ్జాచేయడమే కాదు.. అప్పనంగా అమ్మేస్తున్నారు. చట్టంలోని […]
భూమిని విక్రయించడంలో అడ్డు పడుతున్నాడని వ్యక్తి హత్యకు పథకం ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన హసన్ పర్తి పోలీసులు. సామాజికసారథి, వరంగల్ ప్రతినిధి: భూమిని విక్రయించడంలో అడ్డుపడుతున్నాడన్న కారణంగా ఒక వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ఆరుగురు సబ్యుల ముఠా శుక్రవారం హసన్ పర్తి పోలీసులు ఆట కట్టించారు. ఎంతో చాకచక్యంగా ఎం.డి. అక్బర్ బండ జీవన్ తౌటం వంశీ కృష్ణ ,ఎం.డి.ఆజ్ఞర్ ఎస్.కె సైలానీ, బుర్ర అనిల్, అనే ఆరుగురుని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.వీరి […]
రోడ్డుపై బైఠాయించి, ప్లకార్డులతో బాధితుల ఆందోళన సామాజికసారథి, రామడుగు: తమ భూమిని సర్పంచ్ భర్త ఇతరులు కలిసి భూకబ్జా చేశారని ప్లకార్డులతో బాధితులు రోడ్డుపై ఆందోళన చేశారు. రామడుగు మండలంలోని రంగసాయిపల్లి గ్రామానికి చెందిన సాదు మనమ్మకు ఇద్దరు కుమారులున్నారు. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల్లో జీవనం గడుపుతున్నారు. ఇదే అదనుగా భావించినా రంగసాయి పల్లె సర్పంచి సాదు పద్మ భర్త మునీందర్ తో పాటు మరికొంత కలిసి మాకున్న 10గుంటల భూమిని కబ్జా చేసిండ్రని […]
బంజారాహిల్స్ కు చెందిన సినిమా డిస్ట్రిబ్యూటర్ బుధవారం కిడ్నాప్‌కు గురయ్యాడు. కిడ్నాప్ చేయించింది టీడీపీ నేతేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుడి నుంచి కోట్ల రూపాయల నగదు, భూమి పత్రాలు తీసుకొని వదిలేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కుమారుడు కొండారెడ్డికి.. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ శివగణేశ్‌కుకు కడప జిల్లాకు చెందిన ఓ భూమి విషయంలో కొంతకాలంగా వివాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో శివగణేశ్‌ను కొండారెడ్డి మనుషులు కిడ్నాప్ చేసి ఆ భూమిని దక్కించుకొనేందుకు స్కెచ్ […]
సారథి న్యూస్, కరీంనగర్: సీఎం కేసీఆర్ రాచరికపు పోకడలతో తెలంగాణ అస్థిత్వాన్ని సర్వనాశనం చేస్తున్నారని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు విమర్శించారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు వీఆర్వో వ్యవస్థ రద్దు అనే అంశాన్ని తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. పేదల కష్టపడి డబ్బుసంపాధించి.. ఆ డబ్బులతో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తే ఎల్ఆర్ఎస్ పేరుతో […]
పుట్టాన్‌దొడ్డి(ఇటిక్యాల): ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుట్టాన్‌దొడ్డి శివారులో 171, 172 సర్వేనంబరులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. దీనిపై రెవెన్యూ సిబ్బంది బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసి ఆక్రమించేందుకు యత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
సారథి న్యూస్, రామడుగు: భూ తగాదాలు రెండు కుటుంబాల మధ్య చిచ్చురేపాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వేదిర గ్రామానికి చెందని చెందిన కాసర్ల మనెమ్మ, గుర్రాల పద్మ తమ వ్యవసాయం పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందని దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి, దొడ్డ సుధాకర్‌రెడ్డి అక్కడికి వచ్చి ఈ పొలంలో తమకు వాటా ఉందంటూ మణెమ్మ, పద్మపై వ్యవసాయ పనిముట్లతో దాడిచేశారు. దీంతో వీరికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల రైతులు గమనించి […]
సారథి న్యూస్, హైదరాబాద్: చైనా సరిహద్దులో పోరాడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల చెక్కు రూపంలో నగదు అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇంటి స్థలం కూడా అందించబోతోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా రూ.20 కోట్ల విలువైన 711 గజాల స్థలాన్ని కేటాయించింది. మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా ఈ స్థలాన్ని సంతోష్ బాబు కుటుంబానికి అప్పగించనుంది. […]