Breaking News

ఆరుగురు సభ్యుల ముఠా అరెస్టు

ఆరుగురు సభ్యుల ముఠా అరెస్టు
  • భూమిని విక్రయించడంలో అడ్డు పడుతున్నాడని వ్యక్తి హత్యకు పథకం
  • ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన హసన్ పర్తి పోలీసులు.

సామాజికసారథి, వరంగల్ ప్రతినిధి: భూమిని  విక్రయించడంలో అడ్డుపడుతున్నాడన్న కారణంగా  ఒక వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ఆరుగురు సబ్యుల ముఠా శుక్రవారం హసన్ పర్తి పోలీసులు ఆట కట్టించారు. ఎంతో చాకచక్యంగా ఎం.డి. అక్బర్ బండ జీవన్ తౌటం వంశీ కృష్ణ ,ఎం.డి.ఆజ్ఞర్  ఎస్.కె సైలానీ, బుర్ర అనిల్, అనే ఆరుగురుని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.వీరి నుండి హత్య చేసేందుకుగాను వినియోగించిన బిట్ తో పాటు బాధితుడికి చెందిన మూడు గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ అరెస్టుకు సంబందించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ, పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడు అన్నసాగర్ గ్రామ సర్పంచ్ భర్త బండ జీవన్ రెడ్డి నకిలీ దస్తావేజులో అన్నాసాగర్ గ్రామ శివారులో ప్రాంతంలో నాలుగు ఎకరాల పోలాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ పోలం ప్రక్కనే అదే గ్రామానికి చెందిన నల్లా శ్యాంసుందర్ (బాధితుడు) అనే వ్యక్తి చెందిన పోలం ప్రక్కనే వుండటంతో, సర్పంచ్ భర్త పోలాన్ని కొనుగోలు చేసేందుకు వచ్చే వారికి ఈ పోలం వివాదంలో వున్నదని బాధితుడు శ్యాంసుందర్ తెలియజేస్తుండంతో పోలాన్ని కోనేందుకు వచ్చిన వారు పోలం కోనుగోలు చేయకుండా తిరిగి పోతుండంతో, నిందితుడు జీవన్ రెడ్డి శ్యాంసుందర్ రెడ్డిపై కక్ష్య పెంచుకోని వీడు చస్తేగాని తన పోలం అమ్ముడుపోడని గ్రహించి శ్యాంసుందర్ను హత్య చేసేందుకు సిద్ధపడ్డాడు. ఇందుకుగాను నిందితుడు జీవన్ రెడ్డి అన్నాసాగర్ గ్రామానికి చెందిన మరో ఇద్దరు నిందితులు వంశీ కృష్ణ, అనిలను సంప్రదించగా వంశీకృష్ణకు నిందితుల్లో ఒకడైన అల్లర్ స్నేహితుడు కావడంతో ఇతని ద్వారా శ్యాంసుందర్ రెడ్డి హత్య చేసేందుకు పథకం వేసారు. ఇందుకుగాను వంశీకృష్ణ అజరు 40వేల రూపాయలు అందజేసాడు

.

ఇందులో భాగంగానే నిందితుడు అజ్ఞర్ సూచనల మేరకు మిగితా నిందితులు అక్బర్, సైలానీ ఈ గత నెల డిసెంబర్ 30వ తారీకు రోజున బాధితుడు శ్యాంసుందర్ రెడ్డి తన పోలంలోని వ్యవసాయ పనులు ముగించుకోని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో నిందితులు అక్బర్, సైలాన్ మరో ద్వి చక్రవాహనంపై బాధితుడు శ్యాంసుందర్ రెడ్డిని వెంబడిస్తూ నిర్మానుష్య ప్రదేశంలో నిందితులు జీవన్ రెడ్డి ఇచ్చిన బిట్ రాజ్ శ్యాంసుందర్ వెనుకనుండి బలంగా కోట్టడంతో క్రింద పడిన శ్యాంసుందర్ రెడ్డిని నిందితులు తీవ్రంగా గాయపర్చి అతని మెడలోని బంగారు గొలుసు లాక్కోని అక్కడి నుండి పారిపోయారు.

బాధితుడు శ్యాంసుందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసిపి శ్రీనివాస్ అధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన హసన్‌పర్తి పోలీసులు నిందితులను గుర్తించడం జరిగింది. నిందితులను పట్టుకోనే క్రమంలోనే ఈరోజు ఉదయం నల్లగుట్ట వద్ద హసన్‌పర్తి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో అనుమానస్పదంగా ద్విచక్రవాహనంపై వస్తున్న నిందితులైన అక్బర్, సైలానీలను పోలీసులు అడ్డగిస్తున్న సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు నిందితులను పట్టుకోని విచారించగా శ్యాంసుందర్ రెడ్డి హత్యకు యత్నించినట్లుగా నిందితులు అంగీకరించడంతో పాటు, నిందితుల ఇచ్చిన సమాచారం మేరకు మిగితా నిందితులను పోలీసుల అరెస్టు చేసి విచారించగా నిందితులు పాల్పడిన నేరాలన్ని ఎదుట అంగీకరించారు. నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనరిచిన సెంట్రల్ జోన్ డిసిపి పుష్పారెడ్డి, కాజీపేట ఏసిపి శ్రీనివాస్, హసనపర్తి ఇన్ స్పెక్టర్ శ్రీధర్ రావు, ఎస్.ఐలు విజయ్ కుమార్,సాంబయ్య, ఏఏఓ సల్మాన్ పాషా, కానిస్టేబుళ్లు – క్రాంతికుమార్, సతీష్, నగేష్, హోంగార్డ్ శ్రీనివాస్లను పోలీస్ కమిషనర్ అభినందించారు.