Breaking News

Day: September 10, 2020

కేంద్రం కొత్త విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం

కేంద్రం కొత్త విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం

కేంద్రం అబద్ధాలకు కూడా ఓ హద్దు ఉండాలి ఇంత మోసపూరిత సర్కారును చూడలేదు లోక్​సభ, రాజ్యసభ సభ్యులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సారథి న్యూస్, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్​సభ, రాజ్యసభ సభ్యులు, సీనియర్ అధికారులతో గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈనెల 14 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, కేంద్రం […]

Read More
డిసెంబర్​నాటికి పేదలకు 85వేల ఇళ్లు

డిసెంబర్​ నాటికి పేదలకు 85వేల ఇళ్లు

సారథి న్యూస్, హైదరాబాద్: నగర శివారులోని కొల్లూరు సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్పీకర్ ​పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు గురువారం సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సుమారు 85వేల ఇళ్లను పేదలకు అందించనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం […]

Read More

ఇదేనా బంగారు తెలంగాణ

సారథి న్యూస్, కరీంనగర్: సీఎం కేసీఆర్​ రాచరికపు పోకడలతో తెలంగాణ అస్థిత్వాన్ని సర్వనాశనం చేస్తున్నారని కరీంనగర్​ జిల్లా కాంగ్రెస్​ పార్టీ బీసీ సెల్​ అధ్యక్షుడు పులి ఆంజనేయులు విమర్శించారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన కరీంనగర్​లో మీడియాతో మాట్లాడారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు వీఆర్వో వ్యవస్థ రద్దు అనే అంశాన్ని తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. పేదల కష్టపడి డబ్బుసంపాధించి.. ఆ డబ్బులతో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తే ఎల్​ఆర్​ఎస్​ పేరుతో […]

Read More

కల్లాలు నిర్మించుకోండి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: రైతులు తమ పంటపొలాల్లో కల్లాలు ఏర్పాటు చేసుకోవాలని మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్​ కోరారు. గురువారం ఆయన మండలంలోని జాంబికుంట, మూసాపేట తదితర గ్రామాల్లో నూతనంగా నిర్మించిన కల్లాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్​ఎస్​ ప్రభుత్వం రైతుల కోసం కల్లాలను నిర్మించి ఇస్తుందని చెప్పారు. ఈ పథకాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సురేశ్​ గౌడ్, ఎంపీడీవో రామ్ నారాయణ […]

Read More

ఏపీలో రాక్షసపాలన.. లోకేశ్​ ఫైర్​

సారథిన్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో రాక్షసపాలన కొనసాగుతున్నదని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్​ ఆరోపించారు. ప్రశ్నించిన వారందని ఈ రాక్షస ప్రభుత్వం జైలుకు పంపిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్​ చేస్తారా? ఇంతకంటే ఈ రాష్ట్రంలో దారుణమైన విషయం ఏముంటది అనిపేర్కొన్నారు. తెలుగుదేశం కార్యకర్తల జోలికి వస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీసిన గిరిజన అధికారిపై జులుం ప్రదర్శించడం ఘోరమన్నారు. మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్‌పై పిచ్చివాడనే ముద్ర వేశారని […]

Read More

ఆత్మహత్యలను ఆపుదాం!

సారథి న్యూస్, రామడుగు: ‘చావు సమస్యకు పరిష్కారం కాదు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. డిప్రెషన్​కు గురైనప్పుడు దగ్గరి వాళ్లతో మాట్లాడాలి. మనం జీవితంలో సాధించిన విజయాలను స్మరించుకోవాలి. అంతేకానీ చనిపోతే ఏ ప్రయోజనం ఉండదు. కొత్తజీవితాన్ని ప్రారంభించాలి. కొత్తగా ఆలోచించాలి. కొత్త దారిలో పయనించాలి. అప్పడే విజయం మన పాదలచెంతకు చేరుతుంది’ అని ప్రముఖ సైకాలజిస్ట్​, తెలంగాణ సైకాలజిస్ట్​ అసోషియేషన్​ జిల్లా అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం సూచించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా […]

Read More

పామాయిల్ సాగును ప్రోత్సహించాలి

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ సాగును ప్రోత్సహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. రాష్ట్రానికి కాళేశ్వరం జలాలు పుష్కలంగా వస్తున్నాయని.. ఖమ్మం జిల్లాకు వరప్రదాయిని అయిన సీతారామ ప్రాజెక్టు జలాలు కూడా త్వరలోనే వస్తాయని అందువల్ల ప్రభుత్వం పామాయిల్ సాగును ప్రోత్సహిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని రైతులు లాభపడతారని పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. పామాయిల్​ మొక్కల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహకం అందించాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా ఫ్యాక్టరీలు కూడా […]

Read More
తెలంగాణ వచ్చినా.. ఎలాంటి న్యాయం జరగలేదని

తెలంగాణ వచ్చినా.. ఎలాంటి న్యాయం జరగలేదని

ఒంటిపై పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకుని.. కలకలం రేపిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఘటన సారథి న్యూస్, హైదరాబాద్: అసెంబ్లీకి కూతవేటు దూరం.. గురువారం మధ్యాహ్నం.. రవీంద్రభారతికి సమీపంలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తనకు ఎలాంటి న్యాయం జరగలేదని కేకలు వేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు అంటుకుంటున్న క్రమంలోనే ‘జై తెలంగాణ.. జై కేసీఆర్​’ అంటూ నినాదాలు […]

Read More