పార్టీల గుర్తులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు
– బండి సంజయ్ ను కలిసిన దేవస్థానం చైర్మన్ ఈవో.. సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతన్న అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర మరియు నవబ్రహ్మ ఆలయాల అభివృద్ధికి కేంద్ర పురాతత్వ శాఖ వారి నుండి సహకారం అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలని కోరుతూ దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆలయ ఈవో పురంధర్ కుమార్ మంగళవారం హైదరాబాదులో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు […]
– కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ మిగతా ప్రాజెక్టులపై ఎందుకు లేదు– ఆర్డీఎస్ విషయంలో హామీ ఏమైంది– కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సామాజికసారథి, జోగుళాంబ గద్వాల: రాష్ట్రంలో అత్యంత అవినీతిపాలన నడుస్తోందని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా డిమాండ్ చేస్తున్న కేసీఆర్ ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయి డీపీఆర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నీటి కేటాయింపులు లేకుండా జాతీయహోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. […]
సారథి న్యూస్, మల్దకల్: గ్రామాల అభివృద్దిపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆమె మల్దకల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఫైళ్లను పరిశీలించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి అడిగి తెలుసుకున్నారు.
సారథిన్యూస్, గద్వాల: త్వరలో జరుగబోతున్న తుంగభద్ర పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడపాలని.. పుష్కరఘాట్ల వద్ద మరమ్మతులు ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన అలంపూర్‌లో మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో కేవలం అలంపూర్ ఒక్కచోటే తుంగభద్ర పుష్కరాలు జరుగుతాయని.. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం పులికలు, వేణిసోంపురం, రాజోలి, తుమ్మిళ్ల, పుల్లూరు, అలంపూర్ వద్ద ఉన్న పుష్కరఘాట్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని ప్రభుత్వం బాగుచేయాలని కోరారు. […]
సారథిన్యూస్, గద్వాల: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల రైతుల పంటలు నీటమునిగాయి. వరద ధాటికి రాకపోకలు ఆగిపోయి పలువురు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు దాటికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ,ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు అధికారులు వాగుల వద్ద పర్యవేక్షిస్తున్నారు.
సారథిన్యూస్, గద్వాల: రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నామని చెబుతుండగా.. కొందరు విద్యార్థులు మాత్రం కూలీ పనులకు వెళ్తున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ పాఠాలు ప్రారంభించింది. అయినప్పటికి విద్యార్థులకు సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేక వారు యథావిధిగా పొలంపనులకు వెళ్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో విద్యార్థులు ఓ వాహనంలో ఇలా కూలిపనులకు వెళ్తున్నారు.
సారథిన్యూస్, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో పోలీసులు మంగళవారం పేకాటస్థావరంపై దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి సుమారు రూ. 60 వేలు స్వాధీనం చేసుకున్నారు. శాంతినగర్‌లోని జమ్మలమడుగు కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీచేయగా 9 మంది పేకాట ఆడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.