సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ కానిస్టేబుళ్ల బ్లాక్ మెయిల్ దందాలో ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఓ రక్షకభటుడు ఓ దొంగ.. మరోసారి పోలీస్ అవతారమెత్తడం పలువురి విస్తుగొల్పింది. ఈ ఉదంతంలో తాజాగా గురువారం మరో కొత్తకోణం వెలుగుచూసింది. ఓ వ్యక్తి తనకు పరిచయం ఉన్న మరొకరి తో ఉండడాన్ని కానిస్టేబుళ్లు ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన సంఘటనలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇద్దరు కానిస్టేబుళ్లు, […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లాలో చట్టం, న్యాయం అధికారపార్టీ నాయకులకు చుట్టంగా మారుతోంది. అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల, బడానేతల అండదండలతో తాము కోరుకున్న పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ లు పొందుతున్న కొందరి ఎస్సైల వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. తమకు పోస్టింగ్ ఇప్పించినవారి సేవలో తరించడమే కాదు వారు కనుసైగ చేస్తే చాలు తప్పుడు కేసులతో పాటు సామాన్యులకు పోలీస్ మార్క్ టెస్టీ చూపిస్తున్నారు. తమ స్టేషన్ల పరిధిలో తప్పు చేసినోడు మనోడని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు […]
సామాజిక సారథి, సుల్తానాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి తెలిపారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనాలు పాటించకుండా తమ వాహనాలకు నెంబర్ ప్లేట్లు తొలగించి తీరుతున్న 71వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. వాహనదారులు తమ వాహనాలకు ముందు, వెనక తప్పనిసరిగా నంబరుప్లేట్లు అమర్చుకోవాలన్నారు. నంబరుప్లేట్లు లేకుండా వాహనాలు […]
2.7 క్వింటాళ్ల కాపర్ వైరు స్వాధీనం సామాజిక సారథి,పెద్దపల్లి: అంతర్ జిల్లా ట్రాన్స్ ఫార్మర్ల దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు టీసీపీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. గురువారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు నింధితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు 31 ట్రాన్ ఫార్మర్లను దొంగలించిన నిందితులను చాకచక్యంగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. గురువారం రోజున ఉదయం నేరస్తుల సంచారం చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సుల్తానాబాద్ […]
– వరుస దొంగతనాలతో పోలీసులు పరేషాన్ – భయాందోళనలో పట్టణ ప్రజలు – ఓకేరోజు నాలుగు ఇళ్లలో చోరీ సామాజిక సారథి, రామకృష్ణాపూర్: ఇంటికి తాళం వేశారో ఇక మీ పని అంతే.. వరుస దొంగతనాలతో పోలీసులు పరేషాన్.. భయాందోళనలో పట్టణ ప్రజలు.. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న ‘రామకృష్ణాపూర్’ పట్టణంలో కొద్ది రోజుల వ్యవధిలోనే నిత్యం ఎక్కడో ఓచోట దొంగతనాలు జరుగుతున్నాయి. తాళం వేసి ఉన్న ఇండ్లను దొంగలు ఎక్కువగా టార్గెట్ చేసి, రాత్రికి […]
సామాజిక సారథి, మందమర్రి (మంచిర్యాల): పేక ఆట ఆడుతూ పట్టుబడ్డ ఘటన మందమర్రి లో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం సమయంలో సింగరేణి సబ్ స్టేషన్ వెనుకవైపు గల అటవీ ప్రాంతంలో కొంతమంది పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ చంద్రకుమార్ తన సిబ్బందితో యుక్తంగా అక్కడికి వెళ్లి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులు మిట్టపల్లి బాబు, గుడి కందుల ఓదెలు, దుర్గం రవి, మొయ్య రాంబాబు, సిద్దినాథ్ కిరణ్ లను అదుపులోకి తీసుకోని, వారి వద్ద […]
ఉమ్మడి వరంగల్జిల్లాలో కరోనా బారిన పోలీసులు సామాజిక సారథి, వరంగల్: కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. సెకండ్ డోస్ వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారిపైనా కరోనా దాడి చేస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పదుల సంఖ్యలో కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేయూ పోలీస్ స్టేషన్ సీఐ […]
బీజేపీ నాయకురాలు విజయశాంతి ధ్వజం సామాజికసారథి,హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అధికార పార్టీ చెప్పు చేతుల్లో పనిచేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదని బీజేపీ నాయకురాలు, మాజీఎంపీ విజయశాంతి విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కుమారుడు రాఘవ ఇప్పించిన పోస్టింగ్‌లో ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా వెళ్లలేని స్థితిలో పోలీసు అధికారులు ఉండిపోవడంతోనే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ నాయకులు, వారి కుమారులు, బంధువులు చేసే ఆగడాలు అన్నీఇన్నీ […]