టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఇటీవల కాలంలో కరోనాతో బాధపడుతున్నవారు ఆక్సిజన్ లేక తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో కుప్పం నియోజకవర్గానికి ఆక్సిజన్ కొరత ఉండకూడదని భవిష్యత్ కార్యాచరణతో ఈ ప్లాంట్ ను ప్రారంభించినట్లు తెలిపారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి, కుప్పం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో […]
సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకోకపోతే మరో విద్యుత్ పోరాటానికి సిద్ధమవుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన విద్యుత్ పోరాట ప్రభావంతో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు సాహసించలేదని, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు […]
సారథి న్యూస్, రామడుగు: భూ తగాదాలు రెండు కుటుంబాల మధ్య చిచ్చురేపాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వేదిర గ్రామానికి చెందని చెందిన కాసర్ల మనెమ్మ, గుర్రాల పద్మ తమ వ్యవసాయం పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందని దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి, దొడ్డ సుధాకర్‌రెడ్డి అక్కడికి వచ్చి ఈ పొలంలో తమకు వాటా ఉందంటూ మణెమ్మ, పద్మపై వ్యవసాయ పనిముట్లతో దాడిచేశారు. దీంతో వీరికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల రైతులు గమనించి […]
సారథిన్యూస్, తలకొండపల్లి: ఆలయభూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేశారంటూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలో రైతులు నిరసన తెలిపారు. గ్రామంలోని సర్వే నెంబరు 75 లోని ఉన్న ఆలయభూమిలో కొందరు రహదారిని నిర్మిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్. దేవాదాయశాఖ అధికారులు తగిన చొరవ తీసుకోవాలని, ఆలయ భూములు పరిరక్షించాలని రైతులు డిమాండ్ చేశారు.