సారథి న్యూస్, కర్నూలు: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలుకు సమీపంలో ఉన్న గాజులదిన్నె ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో హంద్రీనీవా నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో నగరంలోని బుధవారంపేట, జోహారపురం, బాపూజీ నగర్, జమ్మిచెట్టు తదితర ప్రాంతాల్లోని లోతట్టు కాలనీ జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. […]
సారథి న్యూస్, రామడుగు: భూ తగాదాలు రెండు కుటుంబాల మధ్య చిచ్చురేపాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వేదిర గ్రామానికి చెందని చెందిన కాసర్ల మనెమ్మ, గుర్రాల పద్మ తమ వ్యవసాయం పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందని దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి, దొడ్డ సుధాకర్‌రెడ్డి అక్కడికి వచ్చి ఈ పొలంలో తమకు వాటా ఉందంటూ మణెమ్మ, పద్మపై వ్యవసాయ పనిముట్లతో దాడిచేశారు. దీంతో వీరికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల రైతులు గమనించి […]
సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పల్లెచెరువు, మాదిగవాని కుంట, కొత్తచెరువు, పందిల్ల, అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి, మల్లంపల్లి, నక్కలకుంట, తాళ్లచెరువు, కొహెడ మండలంలోని బస్వాపూర్, శనిగరం, బెజ్జంకి మండలం బేగంపేట పాతచెరువు, దాచారం, బెజ్జంకి క్రాసింగ్, గుగ్గిళ్ల, ముత్తన్నపేట, మద్దూర్ మండల పరిధిలోని కుటిగల్, గాగిళ్లపూర్, బైరాన్‌పల్లి గ్రామాల్లోని పలు చెరువులు, కుంటలు నిండి […]
ఆపదలో ఎవరున్నా తక్షణం స్పందించే నటుడు సోనూసుద్.. మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్ రాజపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వర్రావు అనే రైతుకు పొలం దున్నేందుకు ఎద్దులు లేవు. దీంతో తన కుమార్తెలను కాడెద్దులుగా చేసుకుని పొలాన్ని దున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విట్టర్లో కృష్ణమూర్తి అనే వ్యక్తి ఈ వీడియోను సోనూసూద్‌కు ట్యాగ్ చేశాడు. దీంతో చలించిపోయిన ఆయన నాగేశ్వర్రావుకు సాయం చేయాలనుకున్నాడు. […]
టాలీవుడ్ హీరోలెవరూ షూటింగ్ చేసేందుకు ముందుకు రావడం లేదు. కానీ కన్నడ హీరోలు మాత్రం షూటింగ్‌కు సై అంటున్నారు. రీసెంట్ గా సుదీప్ కిచ్చా ‘ఫాంటమ్’ సినిమా షూటింగ్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలుపెట్టి షాకిచ్చారు. ఈ బాటలోనే మరో కన్నడ హీరో ఉపేంద్ర కూడా వస్తున్నారు. వెర్సటైల్ హీరో ఉపేంద్ర నటిస్తున్న ‘కబ్జా’ చిత్రంతో పాటు తెలుగులో కూడా ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ […]
సారథి న్యూస్, నర్సంపేట: దళితుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మాట్లాడారు. దళితులు ఆర్థిక పరిపుష్టిని సాధించే విధంగా పైలెట్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం పాడి గేదేల పంపిణీ కింద రూ.17.70కోట్లను విడుదల చేసి రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ పథకాన్ని నర్సంపేట నియోజకవర్గంలో ఆరంభించిందన్నారు. ఆగస్టు మొదటి వారంలో ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు పాడి గేదెల పంపిణీ జరుగనునన్నట్లు తెలిపారు లబ్ధిదారులపై ఎలాంటి భారం […]
సారథి న్యూస్, హైదరాబాద్ : రాజస్థాన్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. రాజస్థాన్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం సామాజిక మాధ్యమాల్లో తమ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకప్ ఫర్ డెమోక్రసీ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, రాజ్యాంగాన్ని […]
సారథిన్యూస్, గోదావరిఖని: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాల అశాజ్యోతి అని దళితసంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రిజర్వేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీ సభ్యుడు వడ్డెపల్లి శంకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు.. అంబేద్కర్ విగ్రహానికి, చత్రపతి సాహుమహరాజ్, మహాత్మా జ్యోతిరావుపూలే చిత్రపటాలకు పూలమాలలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా […]