ఈనెల 31లోగా ఆధార్ అనుసంధానం దళిత బంధు ధరణిపై ప్రత్యేక శ్రద్ధ కలెక్టర్ శరత్ సామాజిక సారథి సంగారెడ్డి ప్రతినిధి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించినట్లు సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాలు, పోడు భూములు, ఆధార్ అనుసంధానం, ధరణి తదితర విషయాలపై ప్రత్యేక […]
సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో జనవరి 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులను కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ , అనుబంధ శాఖలతో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజర్షి మాట్లాడుతూ ఈ […]
అసంపూర్తిగా స్మశాన వాటిక నిర్మాణాలు సామాజిక సారథి, కౌడిపల్లి: స్మశాన వాటిక పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించినా, కొంతమంది నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి పనులు పూర్తిచేయడంలో అధికారులు, సంబంధిత నాయకులు విఫలమవుతున్నారు. అన్నిచోట్ల నిర్మాణాలు పూర్తి చేసినప్పటికీ కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యంతో స్మశానవాటికల నిర్మాణాలు మందకోడిగా కొనసాగుతున్నాయి. కౌడిపల్లి మండలం వెంకటాపూర్ (ఆర్), తిమ్మాపూర్ గ్రామంలో స్మశానవాటికలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఇంతజరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి […]
ఇళ్ల ప్రారంభోత్సవానికి అధికార యంత్రాంగం సన్నాహాలు అర్హుల జాబితా వెల్లడికి నిర్ణయం సంగారెడ్డి జిల్లాలో 1,367 ఇళ్లు సిద్ధం సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: పేదల ఇంటి కలను సహకారం చేసేందుకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధిలో 1,367 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. […]
సామాజిక సారథి ,మెదక్ ప్రతినిధి: ఎటువంటి చిన్న పొరపాటు, సంఘటన జరగకుండా మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గ శాసన మండలి ఎన్నిక ప్రశాంతంగా, సాఫీగా జరిగేలా చూడాలని ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య పోలింగ్ అధికారులకు సూచించారు. ఈ నెల 10 న మెదక్ శాసన మండలికి జరగగున్న ఎన్నికల సందర్భంగా గురువారం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో (9) పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వచ్చిన పోలింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, […]
రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ పీజే పాటిల్ నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు, జరిమానా సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల పోలింగ్ ముగింపునకు 72 గంటల ముందు డిసెంబర్ 7సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎమ్మెల్సీ ప్రచారాన్ని నిలిపివేయాలని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ పీజే పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ డిసెంబరు 10వ తేదీన పోలింగ్ ముగిసే వరకూ నిశబ్ధ కాలం (సైలెన్స్ పీరియడ్) […]
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: సాయుధ దళాల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా కోరారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆయన తన వంతు విరాళం అందజేసి సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు […]
సామాజిక సారథి, వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(డీ82) కాల్వలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా చెరుకూరు, పరిసర గ్రామాల బాధిత రైతులు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో భాగంగా చెరుకూరు, భర్కత్ పల్లి, గానుగట్టుతండా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెరుకూరు సర్పంచ్ రేవతి రాజశేఖర్ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు. ప్రభుత్వం భూములు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని […]