భూమిని విక్రయించడంలో అడ్డు పడుతున్నాడని వ్యక్తి హత్యకు పథకం ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన హసన్ పర్తి పోలీసులు. సామాజికసారథి, వరంగల్ ప్రతినిధి: భూమిని విక్రయించడంలో అడ్డుపడుతున్నాడన్న కారణంగా ఒక వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ఆరుగురు సబ్యుల ముఠా శుక్రవారం హసన్ పర్తి పోలీసులు ఆట కట్టించారు. ఎంతో చాకచక్యంగా ఎం.డి. అక్బర్ బండ జీవన్ తౌటం వంశీ కృష్ణ ,ఎం.డి.ఆజ్ఞర్ ఎస్.కె సైలానీ, బుర్ర అనిల్, అనే ఆరుగురుని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.వీరి […]
కొంతకాలంగా హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు చేస్తున్న ముఠా సైబారాబాద్ పోలీసులకు చిక్కింది. ఉత్తరప్రదేశ్ సరిహద్దులో వీరిని అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితుల నుంచి రూ.5లక్షల నగదు, బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 6న ఈ ముఠా హైదరాబాద్ రాయదుర్గంలో ఈ ముఠా దొంగతనానికి పాల్పడింది. మధుసూదన్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ ఇంట్లో పనిమనుషులుగా చేరిన ముఠా సభ్యులు వారి కుటుంబానికి భోజనంలో మత్తు మందు ఇచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. […]
సారథి న్యూస్, గద్వాల: నిత్యం దొంగతనాలు చేస్తూ.. పోలీసులను పరుగులు పెట్టిస్తున్న ఓ ముఠా ఎట్టకేలకు చిక్కింది. జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పీఎస్ పరిధిలో గత మూడేండ్లుగా ఓ ముఠా తరుచూ దొంగతనాలకు పాల్పడుతున్నది. ఇప్పటికీ ఈ ముఠా సభ్యులు 11 దొంగతనాలు చేశారు. ఈ నెల 18న రాజోలి వైన్‌షాప్‌లో ఈ దొంగలు చోరీ చేసి రూ. 45 వేలు, మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. సోమవారం […]
ఢిల్లీ: టీవీ నటుడు అన్ష్ బాగ్రీపై ఓ రౌడీ గ్యాంగ్ దాడి చేసింది. అతడి తలకు తీవ్రగాయాలు కావడంతో ప్రస్తుతం దవాఖానలో చికిత్సపొందుతున్నాడు. ఓ కాంట్రాక్టర్‌తో గొడవే దాడికి కారణమని తెలుస్తున్నది. అన్ష్ ఇటీవల ఢిల్లీలో తన ఇంటిని నిర్మించే ఇచ్చే పనిని ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించాడు. సదరు కాంట్రాక్టర్ ఇంటిని అసంపూర్తిగా వదిలేశాడు. ఈ క్రమంలో అన్ష్ ఆ కాంట్రాక్టర్‌తో గొడవకు దిగాడు. దీంతో కోపం పెంచుకున్న కాంట్రాక్టర్ అన్ష్ ఇంటికి 10 మంది రౌడీలను […]
సారథిన్యూస్, ఖమ్మం: మావోయిస్టుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది యువకులు ఓ ముఠాగా ఏర్పడి మావోయిస్టుల మంటూ సింగరేణి మహాలక్ష్మి క్యాంప్ హెచ్ఆర్ మేనేజర్‌కు ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో మేనేజర్ వారికి డబ్బులు ఇచ్చాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదుచేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు సదురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
సారథిన్యూస్, రామగుండం: ఓ రాజకీయనాయకుడి ఇంట్లో దర్జాగా పేకాట ఆడుతున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని వారినుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లోని వైస్‌ఎంపీపీ ఇంట్లో కొందరు పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిపై దాడిచేసి 11 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. లక్షా నలబైవేల నగదు, 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో పలువురు మాజీ […]
సారథిన్యూస్, రామగుండం: మద్యం దొంగతనం చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా అప్పనపేట శివారులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా పట్టుబడింది. నిందితుల వద్ద నుంచి 3 బైక్‌లు, 2 ట్రాలీ ఆటోలు, రూ. 3,66,800 విలువైన మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శేఖర్, కుమ్మాటి రాజు, కుర్ర అంజయ్య ముఠాగా ఏర్పడి పలు చోట్ల మద్యం దుకాణాలను […]
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ రౌడీ ముఠా రెచ్చిపోయింది. అరెస్ట్ చేసేందుకు వచ్చిన ఎనిమిది మంది పోలీసులను రౌడీలు కాల్చిచంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కాన్పూర్‌కు చెందిన రౌడీ షీటర్ వికాస్ దూబే పలు కేసుల్లో నిందితుడు. అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కాన్పూర్ సమీపంలో అతడు నివాసం ఉంటున్న డిక్రూ గ్రామానికి వెళ్లారు. వికాస్ ఇంటి సమీపంలోని ఓ ఇంటిమీద కాపుకాసిన రౌడీలు పోలీస్ బృందంపై విక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. […]