సామాజికసారథి, నాగర్ కర్నూల్: కందనూలు మున్సిపాలిటీ అవినీతి కంపు రాజ్యమేలుతోంది. కంచె చేను మేసిందన్న చందంగా మున్సిపాలిటీకి జవాబుదారీగా ఉండాల్సిన మున్సిపల్ కమిషనర్ సిబ్బంది కొందరు స్టాఫ్ తో కుమ్మక్కై అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా మున్సిపాలిటీలో తన మాటవినని కిందిస్థాయి సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ మెమోలు జారీచేయడం పరిపాటిగా మారింది. మున్సిపాలిటీలో ఏ అభివృద్ధి పని జరిగినా కమిషనర్ తనవంతు పర్సెంటేజీ తనకు వచ్చేలా చూసుకుంటున్నారని కొందరు సిబ్బంది చెబుతున్నారు. అంతేకాకుండా నాగర్ కర్నూల్ […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: బిజినేపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో గత వారం రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ లీడర్ గా వచ్చి ఫొటోలు దిగుతుండటం పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అలాంటి వ్యక్తితో పార్టీకి నష్టం జరుగుతుందని కార్యకర్తలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని పిలవకుండా వారే వచ్చి ఫొటోలు దిగుతున్నారని తేల్చిచెప్పారని డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ముక్తార్ అన్నారు. మంగళవారం […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే కేసీఆర్ పరిపాలన కాలంలో రాజకీయంగా పడిన ఇబ్బందులను ఇప్పటికీ నాటి విపక్షమైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గుర్తుచేసుకుంటుంటారు. కేసులు, ఇతరత్రా విషయాల్లో ఇబ్బందులు గురిచేసేవారని చెబుతుంటారు. అధికారమార్పిడి జరగడంతో కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఇదిలాఉండగా, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ హయాంలో రాజకీయంగా జరిగిన కొన్ని సంఘటనలను ఉదాహరిస్తూ ఈనెల […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ లీడర్ నిర్వాకం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడినంటూ ఆ లీడర్ చేస్తున్న అరాచకాలు అన్నీఇన్ని కావు. అధికార పార్టీ లీడర్ నంటూ బిజినేపల్లి మండలంలో ఏకంగా మూడు గ్రామాలపై పెత్తనం చెలాయిస్తుండటంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఆరంభంలోనే ఆ లీడర్ గలీజ్ దందాలకు అడ్డుకట్ట వేయకపోతే మూడు గ్రామాల కార్యకర్తలు, నాయకులు […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిపై కేడర్ లో అసహనం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో తిరగనీయకుండా కార్యకర్తలపై దాడిచేసి వాళ్లను తిరిగి మళ్లీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం పట్ల పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఇలా చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే కంటే కీడు ఎక్కువగా జరుగుతుందని, పార్టీ […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ ఎన్ఆర్ఐ, ఐక్యతా ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆదిలోనే నిరాశే ఎదురైంది. దీంతో చేసేదిలేక దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం కల్వకుర్తి టికెట్‌ను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి ఖరారుచేసింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. గతంలో ఆయన కల్వకుర్తి నుంచి పోటీచేద్దామని భావించినా బీఆర్ఎస్ టికెట్ రాలేదు. 2023 ఎన్నికల్లోనూ మరోసారి నిరాశే ఎదురుకావడంతో కాంగ్రెస్ గూటికి చేరారు. […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సరిపోయినంతా డబ్బు ఉంది కదా.. రాజకీయం చేద్దామని ప్రజలకు సేవ పేరుతో, ఎంతో ఉత్సాహంతో కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ ఎన్ఆర్ఐ, ఐక్యతా ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అంతలోనే సైలెంట్ అయిపోయారు. నియోజకవర్గంలో కొద్దిరోజులు హల్ చల్ చేశారు. కాంగి‘రేసు’లో టికెట్ తనకే పక్కా అని చెప్పుకున్నా.. రానురాను పార్టీలో నేతల చేరికల పరిణామాలు మారుతుండటంతో డీలా పడిపోయారు. కొద్దిరోజులుగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఇంతలోనే మరోనేత కాంగ్రెస్ […]
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నేటితో లాస్ట్ పతాకస్థాయికి పొలిటికల్ వార్ ప్రచారానికి ఒక్క రోజు మాత్రమే గడువు విస్తృతంగా ర్యాలీలు, గ్రామాల్లో సభలు ఆ హోరెత్తిన బహిరంగ సభలు, సమావేశాలు ఓటర్లతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నేతల ‘చివరి పలుకులు’ నవంబర్ 3న ఉపఎన్నిక, 6న ఫలితాలు సామాజిక సారథి, మునుగోడు ప్రత్యేక ప్రతినిధి: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఆఖరి మోఖాకు చేరింది. ప్రచారానికి తుది గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల నేతలంతా సుడిగాలి […]