సామాజికసారథి, రంగారెడ్డి: ఇటీవల దారుణహత్యకు గురైన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన శేషిగారి శివగౌడ్(24), గుండెమోని శివగౌడ్(29) కుటుంబసభ్యులను BRS నేత డా.ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆదివారం పరామర్శించారు. ఆయనను చూడగానే ఆ యువకుల తల్లిదండ్రులు ఘొల్లున ఏడ్చారు. వారిని ఆర్ఎస్పీ ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాట్సాప్ గ్రూపులో ఫొటోలను డిలిట్ చేశారని ఇద్దరు యువకులను కిరాతకంగా చంపడం దారుణమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. కడ్తాల, తలకొండపల్లి, వెల్దండ, కల్వకుర్తి ప్రాంతాల్లో […]
భూమిని విక్రయించడంలో అడ్డు పడుతున్నాడని వ్యక్తి హత్యకు పథకం ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన హసన్ పర్తి పోలీసులు. సామాజికసారథి, వరంగల్ ప్రతినిధి: భూమిని విక్రయించడంలో అడ్డుపడుతున్నాడన్న కారణంగా ఒక వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ఆరుగురు సబ్యుల ముఠా శుక్రవారం హసన్ పర్తి పోలీసులు ఆట కట్టించారు. ఎంతో చాకచక్యంగా ఎం.డి. అక్బర్ బండ జీవన్ తౌటం వంశీ కృష్ణ ,ఎం.డి.ఆజ్ఞర్ ఎస్.కె సైలానీ, బుర్ర అనిల్, అనే ఆరుగురుని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.వీరి […]
సామాజిక సారథి,పెద్ద శంకరంపేట: తన భర్త పెట్టే వేధింపులు తాళలేక అతని భార్య, కూతురు, మరో వ్యక్తితో, కలిసి భర్తను హతమార్చినట్లు అల్లాదుర్గం సీఐ జార్జి, పేట ఎస్ఐ నరేందర్ తెలిపారు. శనివారం పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత నెల 29న రాత్రి మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎరుకల వెంకయ్య (40)అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదైందన్నారు. ఈ కేసును ఛేదించి విచారించగా కట్టుకున్న భార్య, […]
కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో తీవ్ర అలజడి చెలరేగింది. కర్నూల్ జిల్లా నంద్యాలలో వైసీపీ నేత సుబ్బారాయుడు దారుణహత్యకు గురయ్యారు. ప్రస్తుతం నంద్యాలలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సుబ్బారాయుడిపై గుర్తు తెలియని దుండగులు కర్రలతో వచక్షణారహితంగా దాడి చేశారు. నంద్యాలలోని విజయ పాల డెయిరీ సమీపంలో ఈ హత్య జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నది. పాతకక్షలతోనే […]
ఈ ఆగడాలకు అంతే లేదా..? ఇంకెంత మంది బలవ్వాలి.. పరిహారంతో పాలకుల బాధ్యత తీరినట్టేనా? నిందితులకు సకల సత్కారాలు బాధితులకు తీరని వేదనలు లక్నో: మూడు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన దళిత యువతిపై మదమెక్కిన నలుగురు అగ్రవర్ణ కామాంధులు అతికిరాతకంగా లైంగికదాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మరవకముందే.. ఆ చితి మంటలు ఇంకా చల్లారకముందే మరో యువతి అత్యాచారానికి గురై ప్రాణాలు విడిచింది. ఘటన తీవ్రత, మీడియా కవరేజీ, ఇతరత్రా అంశాల దృష్ట్యా.. […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ హత్యకేసులో పలు కీలక నిజాలు వెలుగుచూస్తున్నాయి. హేమంత్ హత్యకు నెలముందే స్కెచ్వేసినట్టు సమాచారం. ఈ హత్యకు కీలక సూత్రధారి అవంతిక మేనమామ యుగందర్‌రెడ్డి అని పోలీసులు తెలిపారు. అతని కేసులో ఏ1గా పెట్టారు. యుగంధర్‌రెడ్డి నెలక్రితమే హేమంత్ హత్యకు స్కెచ్ వేసినట్టు సమాచారం.. పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. చందానగర్‌కు చెందిన లక్ష్మారెడ్డి, అర్చన దంపతుల కుమార్తె అవంతికి జూన్ 10న ఇంట్లో నుంచి […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లో పరువు హత్య తీవ్ర సంచలనంగా మారింది. కూతురు వేరే కులం యువకుడిని పెళ్లి చేసుకుందని తండ్రి సదరు యువకుడిని దారుణంగా హత్యచేయించాడు. సుఫారి గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడ్డట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు.. సంగారెడ్డికి చెందిన లక్ష్మారెడ్డి కుటుంబం చందానగర్‌లో నివాసం ఉంటోంది. లక్ష్మారెడ్డి కూతురు అవంతి, అదే ప్రాంతానికి చెందిన హేమంత్ ప్రేమించుకున్నారు. ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో గత జూన్10న ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు. అనంతరం హేమంత్, […]
సారథి న్యూస్, నర్సాపూర్: జన్మనిచ్చిన పాపానికి ఓ తల్లిపాలిట కన్నకొడుకే కాలయముడిగా మారాడు. కన్నతల్లి అని కూడా చూడకుండా గొడ్డలితో అతిదారుణంగా హతమార్చాడు. ఈ హృదయ విదారకర సంఘటన బుధవారం మెదక్‌జిల్లా హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్ ఖాన్ పల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. షేర్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన కోటగళ్ల నర్సమ్మ(65)కు నలుగురు కొడుకులు ఉన్నారు. చిన్నకొడుకు నర్సింలు అలియాస్ నర్సింగరావు కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ అప్పుడప్పుడు […]