:: జితేందర్‌రెడ్డి,సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధిసెల్నం: 90005 66615 వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెల్లబంగారం రికార్డు ధర పలికింది. ఏకంగా క్వింటాలుకు రూ.10వేలు దాటి ఆల్ టైం రికార్డు స్థాయికి చేరింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఎప్పుడూ లేనంతగా క్వింటాలుకు రూ.10,100కు అమ్ముడుపోయింది. మంచి లాభసాటి ధర రావడంతో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరి క్వింటాలుకు […]
సామాజిక సారథి, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అనేక మంది సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ బత్తుల శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం శ్రీనివాస్ హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. సూపరింటెండెంట్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
సామాజిక సారథి, ఐనవోలు : హన్మకొండ జిల్లా ఐనవోలు లోని మల్లికార్జున స్వామి దేవస్థానంలో జనవరి 13 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐనవోలు దేవస్థానం లో విధులు నిర్వహిస్తున్న 11 నుండి 13 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తే పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని వైద్యులు తెలిపారు. థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు భక్తులు అప్రమత్తంగా ఉండాలని, భక్తులు మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.
సామాజిక సారథి, ఐనవోలు: హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భోగి పండుగను పురస్కరించుకొని స్వామి వారిని మంత్రి సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబు మేయర్ గుండు సుధారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నాగేశ్వర్, అర్చుకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచనలు అందించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులను మంత్రి సత్యవతి రాథోడ్, […]
మేడారం జాతరపై కలెక్టర్ సమీక్ష సామజిక సారథి, ములుగు: మేడారం మహా జాతర విజయవంతం చేయడానికి ఆదివాసి పెద్దలు, అదివాసి సంఘాలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసి పెద్దలు, ఆదివాసి సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఎస్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లడారు. మేడారం జాతరలో ఆదివాసి సంఘాలకు 22 లిక్కర్ షాపులు […]
సామాజిక సారథి, వరంగల్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో మరోసారి మెడికోలు కరోనా బారిన పడ్డారు. ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్న కొంత మందిలో మెడికల్ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉండడం తో టెస్టులు చేయగా టెస్టులు చేసిన వారిలో 17 మందికి కరోనా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. కరోనా వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
భూమిని విక్రయించడంలో అడ్డు పడుతున్నాడని వ్యక్తి హత్యకు పథకం ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన హసన్ పర్తి పోలీసులు. సామాజికసారథి, వరంగల్ ప్రతినిధి: భూమిని విక్రయించడంలో అడ్డుపడుతున్నాడన్న కారణంగా ఒక వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ఆరుగురు సబ్యుల ముఠా శుక్రవారం హసన్ పర్తి పోలీసులు ఆట కట్టించారు. ఎంతో చాకచక్యంగా ఎం.డి. అక్బర్ బండ జీవన్ తౌటం వంశీ కృష్ణ ,ఎం.డి.ఆజ్ఞర్ ఎస్.కె సైలానీ, బుర్ర అనిల్, అనే ఆరుగురుని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.వీరి […]
ఆదివాసీలను ఆగం చేస్తే చూస్తూ ఉరుకోము అభివృద్ధి పేరుతో దోచుకుంటే చర్యలు తప్పవు సామాజిక సారథి,ములుగు ప్రతినిధి: మావోయిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పేరుతో ఇసుక ఏజెన్సీలో జరుగుతున్న మాఫియాపై ఆదివారం లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో గోదావరి పొడవునా ఆదివాసి సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక ర్యాంపులలో ఇసుక మాఫియా చొరబడి తమ లాభాల కోసం ఆదివాసి ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించింది రెండు మూడు గ్రూపులుగా చీల్చి ప్రజల ఐక్యతను దెబ్బతీయడం […]