Breaking News

మావోయిస్టు

ఇసుకాసురులపై చర్యలు

ఇసుకాసురులపై చర్యలు

ఆదివాసీలను ఆగం చేస్తే చూస్తూ ఉరుకోము అభివృద్ధి పేరుతో దోచుకుంటే చర్యలు తప్పవు సామాజిక సారథి,ములుగు ప్రతినిధి: మావోయిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పేరుతో ఇసుక ఏజెన్సీలో జరుగుతున్న మాఫియాపై ఆదివారం లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో గోదావరి పొడవునా ఆదివాసి సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక ర్యాంపులలో ఇసుక మాఫియా చొరబడి తమ లాభాల కోసం ఆదివాసి ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించింది రెండు మూడు గ్రూపులుగా చీల్చి ప్రజల ఐక్యతను దెబ్బతీయడం […]

Read More
ఏజెన్సీలో వెలసిన మావోయిస్టుల కరపత్రాలు

ఏజెన్సీలో మావోయిస్టుల కరపత్రాలు

 పోలీసు ఇన్ఫార్మర్లకు హెచ్చరికలు సామాజిక సారథి, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కొండాపురం‌ గ్రామ సమీపంలోని భద్రాచలం, వెంకటాపురం ప్రధాన రహదారిపై వెలసిన మావోయిస్టు కరపత్రాలు వెలువడ్డాయి. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసిన అనంతరం లేఖ వెలువడటంతో ఈలేఖ స్థానికంగా కలకలం రేపుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం గుప్పిట్లో ఏజెన్సీ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులుకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న బొల్లారం, పెంకవాగు, కలిపాక, సీతారాంపురం గ్రామాలకు చెందిన వ్యక్తులు మావోయిస్టుల గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నారని పోలీసులు చూపే ప్రలోభాలకు, […]

Read More
మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్ట్

మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్ట్

సారథి న్యూస్, వెంకటాపురం: ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండలంలోని పామునూరు అటవీప్రాంతంలో మంగళవారం పేలుడు సామగ్రిని అమర్చుతూ కనిపించిన ఏడుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సంగ్రామ్​జీ పాటిల్​వెల్లడించారు. వారి నుంచి మందుగుండు సామగ్రి, టిఫిన్ బాక్స్ లు, వైర్, బ్లేడ్ లు, కత్తులు, గొడ్డళ్లు, బాణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Read More
మావోయిస్టు పార్టీ ఇన్​ఫార్మర్ల అరెస్ట్​

మావోయిస్టు పార్టీ ఇన్​ఫార్మర్ల అరెస్ట్​

సారథి న్యూస్, వాజేడు, తాడ్వాయి: నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారనే కారణంతో 17మంది ఇన్​ఫార్మర్లను సోమవారం పోలీసులు అరెస్ట్ ​చేశారు. వీరంతా మావోయిస్టు అగ్రనేతలు హరిభుషణ్, దామోదర్, రాజిరెడ్డి, మైలరపు అడేల్లును కలిసేందుకు చత్తీస్​గఢ్​కు వెళ్లి వారికి కావాల్సిన విప్లవ సాహిత్యాన్ని సమకూర్చేందుకు వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. అరెస్ట్​ అయినవారిలో డబ్బకట్ల సుమన్, చందా మహేష్, తాటిపాముల రమేష్, చిడం జంగుదేవ్, రమణ, గంట సత్యం, కుడిమెట్ల శ్రీనివాస్, మెంతని […]

Read More
ప్రజల యాదిలో జాన్ విల్సన్

ప్రజల యాదిలో జాన్ విల్సన్

సారథి న్యూస్, హుస్నాబాద్: మూడు దశాబ్దాలుగా ప్రజల యాదిలో పదిలంగున్న నాటి పోలీస్ అధికారి హుస్నాబాద్ ఎస్సై జాన్ విల్సన్. ప్రజాపోరాటాల వల్లే సమసమాజ స్థాపన జరుగుతుందని భావించిన పీపుల్స్ వార్, అభ్యుదయవాదులు ఓవైపు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు పోలీసుల ఇనుప బూట్ల చప్పుళ్ల మధ్య పల్లెలు నలిగిపోతున్న తరుణమది. రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతంమైన హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా జాన్ విల్సన్ విధుల్లో చేరాడు. నేడు ప్రభుత్వం అవలంబిస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను […]

Read More
మావోయిస్టు మిలిషియా సభ్యుడి అరెస్ట్

మావోయిస్టు మిలిషియా సభ్యుడి అరెస్ట్

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో శనివారం మావోయిస్టు మిలిషియా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన మిడియం చిన్నలక్ష్మయ్య అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. మూడేళ్లుగా మిలిషియా సభ్యుడిగా పనిచేస్తూ, ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీకి నిత్యావసర వస్తువులు అందజేస్తూ.. వారు గ్రామానికి వచ్చినప్పుడల్లా వారికి భోజన వసతి ఏర్పాటు చేస్తూ.. పోలీస్ వారి కదలికలను ఎప్పటికప్పుడు […]

Read More
మావోయిస్టుల దుశ్చర్య

మావోయిస్టుల దుశ్చర్య

టీఆర్ఎస్ ​నాయకుడి దారుణహత్య ఘటనను ఖండించిన ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సారథి న్యూస్, వెంకటాపురం(ములుగు): మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు.. శనివారం రాత్రి ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ​నాయకుడు మాడురి భీమేశ్వర్ రావు(50)ను దారుణంగా హతమార్చారు. రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని బయటకు పిలిచి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపారు. సంఘటన స్థలంలో మావోయిస్టులు లేఖను వదిలివెళ్లారు. ఈ సంఘటనలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ‘అధికార పార్టీలో […]

Read More
మావోయిస్టుల కదలికలపై డ్రోన్​ నిఘా

మావోయిస్టుల కదలికలపై డ్రోన్​ నిఘా

అసిఫాబాద్​: ఆసిఫాబాద్‌ కొమురంభీం జిల్లా కదంబా అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఈనెల 19న ఇద్దరు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు మరింత నిఘాపెంచారు. మావోయిస్టు రాష్ర్ట క‌మిటీ స‌భ్యుడు అడెల్లు అలియాస్ భాస్కర్ ల‌క్ష్యంగా కూంబింగ్ చేపడుతున్నారు. అడవుల్లో తప్పించుకున్న మావోయిస్టుల ఆచూకీని తెలుసుకునేందుకు డ్రోన్ కెమెరాల సాయంతో తీవ్రంగా ప్రయ‌త్నిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాలు, దట్టమైన అడవులను డ్రోన్ల సహాయంతో గ్రేహౌండ్స్ బలగాలు, పోలీసులు జల్లెడ పడుతున్నారు. పెంచ‌క‌ల్‌పేట […]

Read More