Breaking News

Day: January 15, 2022

సంక్రాతిని కొవిడ్ నిబంధనలతో జరుపుకోవాలి

సంక్రాతిని కొవిడ్ నిబంధనలతో జరుపుకోవాలి

 సామాజిక సారథి, రేగొండ: మండల ప్రజలు ఆనందంగా మకర సంక్రాంతి వేడుకలను కొవిడ్ నిబంధనలతో జరుపుకోవాలని రేగొండ మండల ఎస్సై శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనవసరంగా బయటకు వెళ్ళొద్దని, వెళ్లినా కూడా మాస్కు, భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. కొవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Read More
స్వరాజ్య స్థాపనకే పాదయాత్ర

స్వరాజ్య స్థాపనకే పాదయాత్ర

సామాజిక సారథి, హలియా:  స్వరాజ్య స్థాపన కోసమే సీహెచ్ విశారదన్ మహారాజ్ దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టామని డీఎస్పీ మండల అధ్యక్షుడు  పరుశురాం మహారాజ్ అన్నారు. శుక్రవారం తిరుమల గిరి మండలంలోని డాక్టర్ విశారదన్ మహారాజ్ స్వరాజ్య పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ  స్వరాజ్య సంఘీభావ పాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాజ్య స్థాపన కై డా. విశారదన్ మహారాజ్ చేపట్టబోయే పాదయాత్రకు బీసీ,ఎస్సీ,ఎస్టీ లు తరలిరావాలన్నారు.  కల్వకుర్తి లో […]

Read More
కేంద్ర ప్రభుత్వంపై రైతులు తిరగబడాలి

కేంద్ర ప్రభుత్వంపై రైతులు తిరగబడాలి

  • January 15, 2022
  • Comments Off on కేంద్ర ప్రభుత్వంపై రైతులు తిరగబడాలి

సామాజిక సారథి, హలియా : ఎరువుల ధరలు పెంచి రైతు వ్యతిరేక పరిపాలన చేస్తూ రైతులపై భారాన్ని మోపుతున్న కేంద్ర ప్రభుత్వంపై రైతులు తిరగ బడి సరైనా బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం హాలియా లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్ప చెప్పేందుకు కుట్రలు పన్నుతోందని ఆయన తెలిపారు. రైతులతో పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు […]

Read More
పేదింటి ఆడబిడ్డల కోసం..సీఎం స్టాలిన్‌ కొత్త స్కీం

పేదింటి ఆడబిడ్డల కోసం..సీఎం స్టాలిన్‌ కొత్త స్కీం

  • January 15, 2022
  • Comments Off on పేదింటి ఆడబిడ్డల కోసం..సీఎం స్టాలిన్‌ కొత్త స్కీం

సీఎం స్టాలిన్‌ కొత్త స్కీం 762.23 కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం చెన్నై : పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం తమిళనాడు సీఎం స్టాలిన్‌ మరో కొత్త పథకం ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా వధువు కుటుంబానికి ఆర్థిక సహాయమే కాదు.. ఎనిమిది గ్రాముల బంగారు కాసుని అందజేయనున్నారు. 94,700 వేల మందికి పైగా అమ్మాయిల మ్యారేజ్‌ కు.. ఏకంగా 762.23 కోట్లు కేటాయించింది తమిళనాడు ప్రభుత్వం. అలాగే రిటైర్డ్‌ పురోహితుల పింఛన్‌ పథకాన్ని కూడా ప్రారంభించారు. […]

Read More
దళితుడి ఇంట యూపీ సీఎం భోజనం

దళితుడి ఇంట యూపీ సీఎం భోజనం

పేదలకు 45 లక్షల గృహాలను నిర్మించాం లక్నో : ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్‌ సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ఓ దళితుడి ఇంట్లో భోజనం చేశారు. అమృత్‌లాల్‌ భారతి కుటుంబం ఆయనకు ఆతిథ్యమిచ్చింది. ఆయన మంత్రివర్గం నుంచి వైదొలగిన మంత్రులు సమాజ్‌వాదీ పార్టీలో చేరుతూ, ఓబీసీలు, దళితులను యోగి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. అమృత్‌లాల్‌ ఇంట్లో భోజనం చేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ విలేకర్లతో మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీ […]

Read More
రేయాన్ పెయింట్ ఇండస్ట్రీస్ దగ్ధం

రేయాన్ పెయింట్ ఇండస్ట్రీస్ దగ్ధం

రూ.1కోటి నష్టం  సామాజక సారథి, నల్లగొండ క్రైం:  నల్లగొండ  మునిసిపాలిటీలోని  ఆర్జాలబావి ఇండస్ట్రీయల్ ఏరియాలో ఉన్న రెయాన్ పెయింట్ ఫ్యాక్టరీ గురువారం అర్థరాత్రి ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.1కోటి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ యజమాని కోట నరసింహ తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి వ్యాపారం ముగించుకుని కంపెనీకి తాళాలు వేసి పద్మానగర్ లోని తన నివాసానికి వెళ్ళిపోయాడు. అర్థరాత్రి ఇండస్ట్రీస్ నుంచి పొగలు వస్తుండటంతో వాచ్ మెన్ ఫైర్ ఇంజన్ కుసమాచారం […]

Read More
భక్తులు అప్రమత్తంగా ఉండాలి

భక్తులు అప్రమత్తంగా ఉండాలి

సామాజిక సారథి,  ఐనవోలు :  హన్మకొండ జిల్లా ఐనవోలు లోని మల్లికార్జున స్వామి దేవస్థానంలో జనవరి 13 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐనవోలు దేవస్థానం లో విధులు నిర్వహిస్తున్న 11 నుండి 13 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తే పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని  వైద్యులు తెలిపారు. థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు భక్తులు అప్రమత్తంగా ఉండాలని,  భక్తులు మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని  అధికారులు సూచించారు.

Read More
ఉచిత హోమియో వైద్య శిబిరం

ఉచిత హోమియో వైద్య శిబిరం

సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి వాసవీ క్లబ్స్  ఆధ్వర్యంలో పట్టణంలోని ఫ్రై డే మార్కెట్ మానిక్ ప్రభు మందిరంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎం.ఎం.ఆర్  వైద్యశాల సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ ప్రతినిధులు చంద శ్రీధర్, ఇరుకుల్లా ప్రదీప్, కొంపల్లి విద్యాసాగర్, కటకం శ్రీనివాస్, చిలమకూరి నరేంద్ర, నామ శ్రీనివాస్ , నామ భాస్కర్, పుట్నాల లక్ష్మణ్,  వెంకటేశం, మధుసూదన్, వాసవీ సభ్యులు, ఎం.ఎం.ఆర్.  వైద్య బృందం,  తదితరులు పాల్గొన్నారు.

Read More