ఆదివాసీలను ఆగం చేస్తే చూస్తూ ఉరుకోము అభివృద్ధి పేరుతో దోచుకుంటే చర్యలు తప్పవు సామాజిక సారథి,ములుగు ప్రతినిధి: మావోయిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పేరుతో ఇసుక ఏజెన్సీలో జరుగుతున్న మాఫియాపై ఆదివారం లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో గోదావరి పొడవునా ఆదివాసి సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక ర్యాంపులలో ఇసుక మాఫియా చొరబడి తమ లాభాల కోసం ఆదివాసి ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించింది రెండు మూడు గ్రూపులుగా చీల్చి ప్రజల ఐక్యతను దెబ్బతీయడం […]
సామాజిక సారథి, ఏటూరు నాగారం: పీఎల్జీఏ 21వ వార్షిక వారోత్సవాలు డిసెంబర్ 2నుంచి డిసెంబర్10 వరకు జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఏజెన్సీ సరిహద్దు ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలతో అడవులను జల్లడ పడుతున్నారు. రహదారులు, గోదావరి పరీవాహక ప్రాంతాలపై డేగ కన్నుతో సోదాలు నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి మావోయిస్టులు వారి ఉనికిని చాటుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం […]
సారథి న్యూస్, వాజేడు(ములుగు): మావోయిస్టులు వారోత్సవాల పేరుతో బంద్ లు చేయడం, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని, వారికి సహకరించినట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా ఓఎస్డీ సురేష్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో ఓవైపు కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మావోయిస్టులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పూనుకోవడంతో ప్రజల్లో వారిపట్ల వ్యతిరేకత పెరిగిందన్నారు. అడవుల్లో ఉండే గిరిజనులకు విద్య, వైద్యం, ఆర్థిక స్వావలంబన అందకుండా పురోగతికి మావోయిస్టులు అడ్డుపడుతున్నారని అన్నారు. గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడకుండా […]
సారథిన్యూస్, ఖమ్మం: మావోయిస్టుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది యువకులు ఓ ముఠాగా ఏర్పడి మావోయిస్టుల మంటూ సింగరేణి మహాలక్ష్మి క్యాంప్ హెచ్ఆర్ మేనేజర్‌కు ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో మేనేజర్ వారికి డబ్బులు ఇచ్చాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదుచేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు సదురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.