సామాజిక సారథి, ఐనవోలు : హన్మకొండ జిల్లా ఐనవోలు లోని మల్లికార్జున స్వామి దేవస్థానంలో జనవరి 13 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐనవోలు దేవస్థానం లో విధులు నిర్వహిస్తున్న 11 నుండి 13 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తే పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని వైద్యులు తెలిపారు. థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు భక్తులు అప్రమత్తంగా ఉండాలని, భక్తులు మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.
అధికారులతో మంత్రి దయాకర్ రావు సమీక్ష సామాజికసారథి, ఐనవోలు: వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆలయాధికారులు, అర్చకులను ఆదేశించారు. జనవరి 13,14,15 తేదీల్లో మూడు రోజులపాటు జరిగే జాతరకు భక్తులు అశేషంగా తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భద్రత, డార్మెటరీలు, చలువ పందిళ్లు, మంచినీటి వసతి, స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గదులు, మహిళలకు ప్రత్యేక వసతులు, క్యూ లైన్లు, విద్యుత్, సీసీకెమెరాలు, […]
సామాజిక సారథి, ఐనవోలు: హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో గురువారం సాయంత్రం మామూనూరు డివిజన్ ఏసీపీ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని అన్ని ప్రధాన కూడళ్ళలో వాహనాలను, కిరాణా షాపులను తనిఖీ చేశారు. అనంతరం మండల కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఏసీపీ నరేష్ కుమార్ గ్రామ ప్రజలకు నిషేధిత మత్తు పదార్థాల వినియోగం మైనర్ డ్రైవింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్డెన్ సెర్చ్ లో సరైన […]
సామాజిక సారథి, ఐనవోలు/ హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పల్లెలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలం లోని పంతిని గ్రామంలో రూ.12.60లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠ దామాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో పల్లెలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పంతిని నుంచి చెన్నారం గ్రామానికి రూ.2.50కోట్ల వ్యయంతో బీటీ రోడ్ మంజూరయ్యిందని, త్వరలో పనులు పూర్తి […]