Breaking News

Corona

జనగామ ఎమ్మెల్యేకు కరోనా

జనగామ ఎమ్మెల్యేకు కరోనా

సామాజిక సారథి, జనగామ: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కరోనా మొదటి వేవ్ లో కూడా ముత్తిరెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన సతీమణి, గన్ మెన్, వంటమనిషి, డ్రైవర్ కు కూడా కరోనా సోకింది. దీంతో ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సూచించారు.

Read More
తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

24గంటలో 55వేల పైచిలుకు కేసులు ఈ నెల 30 వరకూ విద్యాసంస్థలకు సెలవులు  అన్ని యూనిర్సిటీ పరిధిలోని పరీక్షలు వాయిదా సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,043 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 7,09,209కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వాటితో కలిపి  రాష్ట్రంలో 4,057మంది […]

Read More
వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ కరోనా

వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ కరోనా

సామాజిక సారథి, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అనేక మంది సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ బత్తుల శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం శ్రీనివాస్ హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. సూపరింటెండెంట్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

Read More
భక్తులు అప్రమత్తంగా ఉండాలి

భక్తులు అప్రమత్తంగా ఉండాలి

సామాజిక సారథి,  ఐనవోలు :  హన్మకొండ జిల్లా ఐనవోలు లోని మల్లికార్జున స్వామి దేవస్థానంలో జనవరి 13 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐనవోలు దేవస్థానం లో విధులు నిర్వహిస్తున్న 11 నుండి 13 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తే పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని  వైద్యులు తెలిపారు. థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు భక్తులు అప్రమత్తంగా ఉండాలని,  భక్తులు మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని  అధికారులు సూచించారు.

Read More
ఖాకీలను వణికిస్తోన్న కరోనా

ఖాకీలను వణికిస్తోన్న కరోనా

ఉమ్మడి వరంగల్​జిల్లాలో కరోనా బారిన పోలీసులు సామాజిక సారథి, వరంగల్: కరోనా థర్డ్‌ వేవ్‌ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ పూర్తి చేసుకున్న వారిపైనా కరోనా దాడి చేస్తుండడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బంది పదుల సంఖ్యలో కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేయూ పోలీస్‌ స్టేషన్‌ సీఐ […]

Read More
మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

సామాజిక సారథి, వరంగల్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో మరోసారి మెడికోలు కరోనా బారిన పడ్డారు.  ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్న కొంత మందిలో మెడికల్ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉండడం తో టెస్టులు చేయగా టెస్టులు చేసిన వారిలో 17 మందికి కరోనా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. కరోనా వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

Read More
లక్షకుపైగా కేసులు

లక్షకుపైగా కేసులు

దేశంలో విస్తరిస్తున్న కరోనా ఒమిక్రాన్‌ కేసులు 3,071 న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. వరుసగా శనివారం రెండవరోజు కొత్తగా కేసులు లక్ష దాటాయి. ముందురోజు కంటే 21శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు మూడువేలకు పైగానే నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. శుక్రవారం 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, 1,41,986 మందికి వైరస్‌ పాజిటివ్‌గా […]

Read More
మహేశ్బాబుకు కరోనా పాజిటివ్‌

మహేశ్​బాబుకు కరోనా పాజిటివ్‌

త్వరగా కోలుకోవాలని చిరంజీవి, ఎన్టీఆర్​ ట్వీట్‌ సామాజిక సారథి, హైదరాబాద్: సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్‌ మీడియా ద్వారా నిర్ధారించారు. నాకు కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స, స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. అయితే నాతో కాంటాక్ట్‌ అయినవారంతా పరీక్ష చేయించుకోవాలని ఆయన ట్విట్టర్​ ద్వారా కోరారు. అలాగే ఎవరైతే వ్యాక్సినేషన్‌ తీసుకోలేదో […]

Read More