సామాజిక సారథి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంటు సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి గత రెండు రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో అనుమానం వచ్చి కోవిడ్ టెస్టు చేసుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల రాష్ట్రంలోని జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ లు, పలువురు ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గాంధీభవన్ తో పాటు ఆయన నివాసానికెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ […]
3146 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు సామాజికసారథి, హైదరాబాద్: మహానగరం హైదరాబాద్ లో డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. భారీగా మద్యం అమ్మకాలు సాగాయి. మందేసిచిందేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే బయటకు తాగి వచ్చిన వారిని పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో బుక్ చేశారు. డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్లో డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయయి. నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 3146 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ […]
సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ బిడ్డ, ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం మనందరికీ గర్వకారణమని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. గోరటి వెంకన్న సాహిత్యం తెలంగాణ ఆత్మను సాక్షాత్కరించేలా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం సోషల్‌మీడియాలో పోస్ట్‌చేశారు. ‘‘వల్లంకి తాళం’ రచనతో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన గోరటి వెంకన్న గారికి ఆత్మీయ అభినందనలు. తన సాహిత్యంతో తెలంగాణ జీవన చిత్రాన్ని కళ్లకు కట్టిన గొప్ప సాహితీవేత్త. […]
భారీగా పోలీసుల మోహరింపు సామాజిక సారథి, కరీంనగర్: జీవోనం.317ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్‌లో ఆదివారం రాత్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన క్యాంపు కార్యాలయం వద్ద జాగరణ దీక్ష చేపట్టారు. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో దీక్షకు అనుమతి లేకపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని ఎంపీ బండి సంజయ్ బైక్ పై క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. […]
విద్యుత్ ప్రీపెయిడ్ మీటర్లు బిల్లు బకాయిలను తగ్గించేందు.. విద్యుత్ శాఖ సరికొత్త ప్రక్రియ సంగారెడ్డి జిల్లాలో 6లక్షల కనెక్షన్లు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: సంగారెడ్డి జిల్లాలోని విద్యుత్ వినియోగానికి ప్రీపెయిడ్ మీటర్లను బిగించేందుకు ఆ శాఖ ప్రక్రియ మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు 1400 ప్రీపెయిడ్ మీటర్లను బిగించింది. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ఆరు లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా పేరుకుపోతున్న విద్యుత్ బకాయిలను తగ్గించేందుకే ఈ ప్రక్రియను […]
సామాజిక సారథి, కల్వకుర్తి: రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాడ్గుల మండలం మాన్యతండాకు చెందిన ఎస్సై శ్రీనునాయక్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వికారాబాద్ లో విధులు నిర్వహిస్తూ ఇటీవలే జరిగిన వివాహ అనంతరం ఒడిబియ్యం పోసుకుని తిరుగు ప్రయాణంలో తండ్రితో పాటు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి పార్థివదేహాలకు పూలమాల వేసి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి నివాళులర్పించారు. రూ.20వేల ఆర్థిక సహాయం […]
కోల్‌కతా: కరోనా నయా వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నాయి. జనం పెద్దఎత్తున గుమికూడడం, సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ మరో అడుగు ముందుకేసింది. దాదాపు లాక్‌డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, వినోద పార్కులను జనవరి 3 నుంచి మూసివేస్తున్నట్లు […]
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలపాటు కేసుల భౌతిక విచారణను వాయిదా వేసింది. తిరిగి వర్చువల్ విధానంలోనే విచారణ కొనసాగించాలని నిర్ణయించింది. రెండు వారాల తర్వాత సమీక్షించి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు అత్యున్నత ధర్మాసనం ప్రకటించింది. కోర్టు తాజా నిర్ణయాన్ని బార్ అసోసియేషన్ సహా అన్ని ఇతర పార్టీలకు తెలియజేసినట్టు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ చిరాగ్ భాను సింగ్, బీఎల్‌ఎన్ […]