- మేడారం జాతరపై కలెక్టర్ సమీక్ష
సామజిక సారథి, ములుగు: మేడారం మహా జాతర విజయవంతం చేయడానికి ఆదివాసి పెద్దలు, అదివాసి సంఘాలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసి పెద్దలు, ఆదివాసి సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఎస్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లడారు. మేడారం జాతరలో ఆదివాసి సంఘాలకు 22 లిక్కర్ షాపులు కేటాయించడం జరిగిందని అన్నారు. ఆదివాసీ సంఘాల మధ్య సమన్వయం ఉండాలని, అన్ని సంఘాలు జాతర విజయవంతానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమం ప్రారంభంలో ఆదివాసి సంఘం నాయకుల అభిప్రాయాలను వివరించాలని వారి అభిప్రాయాలను చట్టపరంగా అమలు చేస్తామని అన్నారు. సమావేశంలో ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు మాట్లాడుతూ మద్యం బెల్లం, కొబ్బరి కాయల షాపుల పర్మిషన్ రెండు వారాలు వరకు పర్మిషన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాటి, డీఆర్వో రమాదేవి, ఐటీడీఎ ఎపీఓ జె.వసంతరావు, డీటీవో మంకిడి ఎర్రయ్య, తాడువాయి తహసీల్దార్ శ్రీనివాస్, జిల్లా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.