సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి వాసవీ క్లబ్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఫ్రై డే మార్కెట్ మానిక్ ప్రభు మందిరంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎం.ఎం.ఆర్ వైద్యశాల సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ ప్రతినిధులు చంద శ్రీధర్, ఇరుకుల్లా ప్రదీప్, కొంపల్లి విద్యాసాగర్, కటకం శ్రీనివాస్, చిలమకూరి నరేంద్ర, నామ శ్రీనివాస్ , నామ భాస్కర్, పుట్నాల లక్ష్మణ్, వెంకటేశం, మధుసూదన్, వాసవీ సభ్యులు, ఎం.ఎం.ఆర్. వైద్య బృందం, తదితరులు పాల్గొన్నారు.
సామాజిక సారథి, వరంగల్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో మరోసారి మెడికోలు కరోనా బారిన పడ్డారు. ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్న కొంత మందిలో మెడికల్ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉండడం తో టెస్టులు చేయగా టెస్టులు చేసిన వారిలో 17 మందికి కరోనా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. కరోనా వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
సామాజిక సారథి, తాడూరు : నాగర్‌కర్నూల్‌జిల్లా తాడూరు మండలం అల్లాపూర్ గ్రామంలో గురువారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకట్ దాస్ హాజరై మాట్లాడుతూ ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు అంటురోగాలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న మాట్లాడుతూ పేద ప్రజలు అందరికీ వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారెడ్డి, సర్పంచ్ […]
సామాజిక సారథి, వలిగొండ: మండల కేంద్రంతో పాటు వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం రాష్ట్ర కుష్టువ్యాధి నిపుణులు డిప్యూటీ మెడికల్ అధికారి వెంకటేశ్వర చారి, అసిస్టెంట్ మెడికల్ అధికారి రాములు పాల్గొని రికార్డులు, రిపోర్టులు పరిశీలించి వైద్య బృందానికి తగు సూచనలు చేశారు. రోగులకు కుష్టు వ్యాధి నిర్దారణ అయిన వెంటనే ప్రాథమిక దశలోనే మందులు వాడితే వ్యాధి నయమవుతుందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుమన్ కళ్యాణ్, శ్రీనివాస్ రెడ్డి, సతీష్, వీణ, పవన్ తేజ, […]
– సీఎం కేసీఆర్ పై మాజీమంత్రి ఈటల ఫైర్ సారథి, హైదరాబాద్: ‘చావునైనా బరిస్తా కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోనని మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. దమ్ముంటే తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ కక్షసాధింపు చర్యలు ఎలా ఉంటాయో తనను తెలుసన్నారు. సోమవారం శామీర్ పేటలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. కేసీఆర్ చట్టాన్ని, సిస్టంను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. నాటి సీఎం […]
సారథిన్యూస్, నిజామాబాద్: కరోనాతో జనాలు ఇబ్బందులు పడుతుంటే.. ఇదే అదనుగా చేసుకొని నిజామాబాద్ జిల్లాలో మెడికల్ దుకాణాలు దోపిడీ పర్వానికి తెరలేపాయి. కరోనా మందులను ఎమ్మార్పీ కంటే రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చాలా చోట్ల కృత్రిమ కొరత సృష్టించి పేదప్రజలను నిలువునా ముంచుతున్నారు. ప్రజలు వైద్యం కోసం ఉన్న బంగారం, ఆస్తులు అమ్ముకుంటున్నారు. కాగా ఈ దోపిడీ దందాపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. జిల్లాలోని మెడికల్ షాపులను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ […]
సారథిన్యూస్, గద్వాల: లంచం తీసుకుంటూ జోగుళాంబ గద్వాల జిల్లా డీఎంహెచ్‌వో భీమ్‌నాయక్ ఏసీబీ అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వడ్డేపల్లి మండలంలో డాక్టర్ ఏ మంజుల మెడికల్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె కాకతీయ యూనివర్సిటీలో పీజీలో జాయిన్ అయ్యారు. ఇందుకోసం రిలీవింగ్ ఆర్డర్ కోసం డీఎంహెచ్‌వోకు దరఖాస్తు చేసుకున్నారు. లంచాలకు అలవాటు పడ్డ డీఎంహెచ్‌వో తన కిందిస్థాయి ఉద్యోగిని సైతం రూ. 7000 లంచం అడిగాడు. దీంతో మంజుల […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు మెడికల్ కాలేజీ నెఫ్రాలజీ విభాగానికి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కు రెండు సీట్లు అప్రూవల్ వచ్చాయని డీఎంఈ, ప్రిన్సిపల్ డాక్టర్ పి.చంద్రశేఖర్ శనివారం తెలిపారు. ఇన్నిరోజుల తర్వాత అప్రూవల్వచ్చిందన్నారు.