Breaking News

ఇసుకాసురులపై చర్యలు

ఇసుకాసురులపై చర్యలు
  • ఆదివాసీలను ఆగం చేస్తే చూస్తూ ఉరుకోము
  • అభివృద్ధి పేరుతో దోచుకుంటే చర్యలు తప్పవు

సామాజిక సారథి,ములుగు ప్రతినిధి: మావోయిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పేరుతో ఇసుక ఏజెన్సీలో జరుగుతున్న మాఫియాపై ఆదివారం లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో గోదావరి పొడవునా ఆదివాసి సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక ర్యాంపులలో ఇసుక మాఫియా చొరబడి తమ లాభాల కోసం ఆదివాసి ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించింది రెండు మూడు గ్రూపులుగా చీల్చి ప్రజల ఐక్యతను దెబ్బతీయడం చేస్తున్నారని కాంట్రాక్టర్లను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేక విడుదల చేశారు.కొంతమంది కాంట్రాక్టర్లు పేర్లతో చెలామణి అవుతూ గ్రామాల అభివృద్ధి పరుస్తామని పేరుతో ప్రజలను నమ్మబలికి మోసాలు చేస్తున్నారని, ఇలాంటి వారు ఇసుక క్వారీల కాంటాక్ట్ తీసుకుని పెద్దపెద్ద కాంట్రాక్టర్లకు ఒకరికి తెలియకుండా మరొకరు, అమ్ముకొని గ్రామ వికాసానికి ఎలాంటి పనులు చేయకుండా కోట్ల రూపాయలు దండుకుని వెళ్లిపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. పైగా గ్రామాల్లో ఆదివాసీ ప్రజలు పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని ప్రజల పై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. స్థానికేతరుడైన ప్రభాకర్ చౌదరి ఇసుక మాఫియాను ప్రోత్సహించి అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నాడని అతను ఇసుక ర్యాంపులు నడిపిన ప్రతి చోట ప్రజలను మోసం చేస్తున్నాడని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలకు భూమి పట్టాదారులు డబ్బులు చెల్లించకుండా టాక్టర్ కిరాయిలు ఇవ్వకుండా ఎగ్గొట్టడం ప్రస్తుతం నడుపుతున్నా ఇసుక ర్యాంపు వద్ద కూడా డబ్బులు ఇవ్వకుండా పోలీసులతో కుమ్మక్కై ప్రశ్నించే ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నాడని అన్నారు.అదేవిధంగా ముళ్లకట్ట రాంపూర్ గ్రామాల్లో ఇసుక ర్యాంపులవద్ద కూడా కోదాడకు చెందిన పిల్లుట్ల శీను ఇలాగే ప్రవర్తిస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు. గ్రామాల్లోని  కొంతమంది యువకులకు మద్యం తాగిస్తూ విలాసాలకు అలవాటు చేసి ఇలా గ్రూపులు చేసి ప్రజలను చీల్చి పబ్బం గడుపుకుంటున్నాడన్నారు. ఈ కాంట్రాక్టర్లు తమ పద్ధతులు మార్చుకోకపోతే ప్రజల చేతిలో శిక్ష తప్పదని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఏజెన్సీలోని ఆదివాసీ ప్రజలంతా ఇలాంటి ఇసుక మాఫియాలను తరిమి తరిమి కొట్టాలని,వీరు నడుపుతున్న ఇసుక క్వారీలను అడ్డుకోవాలని డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పిలుపునిచ్చారు.