సామాజిక సారథి , నాగర్ కర్నూల్:నాగర్ కర్నూల్ జిల్లా పాలెం గ్రామం లో ని తోట పల్లి సుబ్రమణ్యం విద్యాలయం లోనీ పాఠశాలలో1997 – 1998 పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు బాలాజీ గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. సుబ్బయ్య విగ్రహం కు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు గుర్తింపు […]
ఏళ్లుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల వెట్టిచాకిరిత్రీమెన్ కమిటీ ద్వారా ఎంపికైనా ఉద్యోగ భద్రత కరువునెలల తరబడి జీతాలు రాక రోడ్డున పడుతున్న గెస్ట్ లెక్చరర్లుకొత్త ప్రభుత్వం నిర్ణయంపై ఎదురుచూపులు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:గవర్నమెంట్ జూనియర్ కాలేజీలను నమ్ముకొని ఏళ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీవితాలు దయనీయంగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న సుమారు 2వేల మంది గెస్ట్ లెక్చరర్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ఓ వైపు […]
చిన్నారులపై ప్రభావం నిర్లక్ష్యమే కారణం జాగ్రత్తలు సూచిస్తున్న నిపుణులు న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ చిన్నారులపై తీవ్రప్రభావం చూపుతోంది. దేశరాజధాని ఢిల్లీలో ఈనెల 9 నుంచి 12 తేదీల మధ్యలోనే ఏడుగురు చిన్నారులు మృతిచెందినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఐదేళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్కూడా విస్తృతంగా లేకపోవడంతో రిస్క్ ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దవారిలో లక్షణాలు కనిపించకపోగా వారిలో ఇబ్బందులు తక్కువగానే ఉంటున్నాయి. పిల్లల్లో వాంతులు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. బయట నుంచి రాగానే శానిటైజ్ చేసుకోకుండా […]
సామాజిక సారథి, వరంగల్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో మరోసారి మెడికోలు కరోనా బారిన పడ్డారు. ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్న కొంత మందిలో మెడికల్ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉండడం తో టెస్టులు చేయగా టెస్టులు చేసిన వారిలో 17 మందికి కరోనా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. కరోనా వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
సంక్రాంతికి ఆర్టీసీ అదనపు బస్సులు ఎక్స్ట్రా ఛార్జీలు లేకుండానే ఏర్పాటు తెలంగాణ, ఏపీలోని అన్ని ప్రాంతాలకు.. 18 మంది ఉంటే నేరుగా వారి వద్దకే బస్సు సామాజికసారథి, హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్మహానగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ 4,318 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు […]
సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌కు సంబంధించిన పరీక్షల ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్ మీడియట్బోర్డు ఖరారు చేసింది. బుధవారం నుంచి ఈ నెల 24 వరకు చెల్లించవచ్చని తెలిపింది. నిర్ణీత సమయంలో ఫీజు చెల్లించనివారు.. లేటు ఫీజుతో ఫిబ్రవరి 21వ తేదీ వరకు చెల్లించవచ్చని బోర్డు కార్యదర్శి జలీల్ ప్రకటించారు. లేటు ఫీజు రూ.100తో ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 1 నుంచి 7 […]
చిన్నారులతో వెట్టిచాకిరీ చర్యలు తీసుకుంటామన్న డీఈవో సామాజిక సారథి, కౌడిపల్లి: ప్రభుత్వ స్కూళ్లలో చిన్నారులే స్వీపర్లుగా మారారు. మంగళవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు చీపురుపట్టి ఊడ్చారు. టీచర్లు కూడా వారిచేత పనులు చేయించారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 600, జడ్పీ హైస్కూళ్లు 140 దాకా ఉన్నాయి. దాదాపు సగం స్కూళ్లలో ఇవే పరిస్థితులు ఉన్నాయి. స్వీపర్లను ఈ ఏడాది నియమించకపోవడంతో పిల్లలే అన్ని పనులు చేస్తున్నారు. తాజాగా […]
సమాజిక సారథి, మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా హావేలి ఘనపూర్ లోని జ్యోతిబాపులే బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో బాలికలకు వైద్యాధికారులు పరీక్షలు చేయగా ఇద్దరు విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్దారణ వైద్యాధికారులు తెలిపారు. అదే విధంగా బాలుర పాఠశాలలో విద్యార్థులకు కరోనా పరీక్షలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలన్నారు. స్కూల్ లో విద్యార్థుల అందరికీ టెస్ట్ చేస్తామని సర్ధన పీ హెచ్ సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్ర శేఖర్ తెలిపారు.