పట్నా: ఉత్కంఠభరితంగా సాగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయం ఎన్డీయేను వరించింది. ఎన్నికల కౌంటింగ్ మంగళవారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. మొత్తం 243 స్థానాల్లో అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ అత్యధికంగా 73 స్థానాలను గెలుచుకుంది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ ఈ సారి 43 స్థానాలకే పరిమితమైంది. కూటముల […]
మరోసారి విజేతగా నిలిచిన రోహిత్ సేన ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి దుబాయ్: ముంబై ఇండియన్స్ మరోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది.. వరుసగా ఐదోసారి విజేతగా కప్ గెలుచుకుంది. ఢిల్లీపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఐపీఎల్ 13 సీజన్ ఫైనల్ మ్యాచ్ చాలా కూల్‌గా సాగింది. ఢిల్లీ విసిరిన 157 పరుగుల టార్గెట్ ను ముంబై బ్యాట్స్‌మెన్స్ చాలా ఈజీగా ఛేదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ […]
అబుదాబి: ఐపీఎల్13 సీజన్లో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన 50వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్పంజాబ్పై రాజస్తాన్రాయల్స్7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన పంజాబ్ దూకుడుకు బ్రేక్ పడినట్లయింది. రాజస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్చేసిన కింగ్స్ పంజాబ్ 186 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. క్రిస్ గేల్ (99; 63 బంతుల్లో 4×6, 6×8), కేఎల్ రాహుల్ (46;41 బంతుల్లో 4×3, 6×2) రాణించడంతో పాటు పూరన్(22; […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. మహారాష్ట్ర సర్కారుపై ఢీ అంటే ఢీ అంటూ ఇటీవల వార్తల్లో పెను సంచలనంగా మారిన కంగనా రనౌత్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ట్వీట్లు చేస్తోంది. అయితే ఆమె చేస్తున్న ట్వీట్లతో పాటు ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్నెస్ ట్రైనర్ మున్నావరలీ సయ్యద్ ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ముంబై […]
ముంబై: టీవీ చానళ్లలో టీఆర్‌పీ కుంభకోణం నేపథ్యంలో బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చి కౌన్సిల్(బార్క్) కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని భాషల్లోని వార్తా చానళ్లకు ప్రతివారం ఇచ్చే రేటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 12వారాల పాటు (మూడు నెలలు) రేటింగ్‌ను ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం టీవీ రేటింగ్ ఇవ్వడానికి గల ప్రమాణాలను సమీక్షించి, రేటింగ్ ప్రక్రియను ఆధునిక సాంకేతికత సాయంతో మెరుగుపర్చాలని భావిస్తున్నట్టు తెలిపింది. బార్క్ నిర్ణయాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్(ఎన్‌బీఏ) స్వాగతించింది. బార్క్ నిర్ణయం సాహసోపేతమైనదని, […]
ఢిల్లీ: ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి ఖుష్బూ సోమవారం మధ్యాహ్నం బీజేపీలో చేరారు. ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆమె మధ్యాహ్నానికే బీజేపీలో చేరారు. ఉదయం ఆమెను పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తున్నట్టు అధిష్ఠానం ప్రకటించింది. కొద్ది సేపటికే ఆమె అధినేత్రి సోనియాకు రాజీనామా లేఖను పంపారు. పార్టీలోని కొందరు నేతలు తనను రాజకీయంగా అణగదొక్కుతున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. కొంతకాలంగా ఆమె కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. […]
ఉత్తర్‌ప్రదేశ్‌లో లైంగికదాడుల పర్వం కొనసాగుతున్నది. హత్రాస్ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు సాగుతున్న వేళ మరో దారుణం చోటుచేసుకున్నది. తాజాగా ఓ పదిహేడేండ్ల విద్యార్థినిపై ఓ నీచుడు లైంగికదాడి చేయగా అతడి ఫ్రెండ్స్ వీడియో తీశారు. ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీకి చెందిన ఓ యువతి అదే పట్టణంలో పాల్టెక్నిక్ చదువుతున్నది. కొంతకాలంగా ఆమెను ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కాలేజీకి వెళ్లిన విద్యార్థినిని సదరు యువకుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఆనంతరం ఓ ఇంట్లోకి […]
పాకిస్థాన్‌లో మైనార్టీలకు రక్షణ కరువైంది. హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు జరగడం అక్కడ పరిపాటిగా మారింది. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని బదిన్ సింద్ పాకిస్థాన్ ప్రాంతంలో ‘శ్రీ రామ్ మందిర్’ను గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం చేశారు. ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలను విధ్వంసం చేయడం పాకిస్థాన్‌లో పరిపాటిగా మారింది. బదిన్ ప్రావిన్స్‌లోని కరియో ఘన్వర్ ప్రాంతంలో ఈ మందిరం వుండేది. అక్టోబర్ 10వ తేదీ రాత్రి కొందరు దుండగులు ఈ మందిరాన్ని కూల్చి వేశారు. […]