దేశవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు విజయ్ చౌక్ వద్ద రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్టీ నేతల ధర్నా న్యూఢిల్లీ: ఇంధన ధరల పెరుగుదలపై నిరసన సెగ పార్లమెంట్‌ను తాకింది. పదిరోజుల్లో వరుసగా 9 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడంపై కాంగ్రెస్ గురువారం దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. పెరుగుతున్న ధరలపై ఆ పార్టీ ఎంపీలు లోక్‌సభలో నిరసనగళం వినిపించారు. పెంచిన ధరలను పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ […]
చిన్నారులపై ప్రభావం నిర్లక్ష్యమే కారణం జాగ్రత్తలు సూచిస్తున్న నిపుణులు న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ చిన్నారులపై తీవ్రప్రభావం చూపుతోంది. దేశరాజధాని ఢిల్లీలో ఈనెల 9 నుంచి 12 తేదీల మధ్యలోనే ఏడుగురు చిన్నారులు మృతిచెందినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఐదేళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్కూడా విస్తృతంగా లేకపోవడంతో రిస్క్ ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దవారిలో లక్షణాలు కనిపించకపోగా వారిలో ఇబ్బందులు తక్కువగానే ఉంటున్నాయి. పిల్లల్లో వాంతులు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. బయట నుంచి రాగానే శానిటైజ్ చేసుకోకుండా […]
ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి గ్రామగ్రామానా మొహల్లా క్లినిక్స్ నెలకు రూ.3వేల నిరుద్యోగభృతి గోవా ప్రజలకు ఆప్వరాల జల్లు సీఎం కేజ్రీవాల్ సంచలన పథకాలు పానాజి: ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల హామీల వర్షం కురుస్తోంది. ఫ్రీ పథకాల జోరు కొనసాగుతోంది. ప్రధానపార్టీల నేతలంతా ఓటర్లను ప్రసన్నంచేసుకునే పనిలో పడ్డారు. తాజాగా గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం […]
శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం దాకా.. ఉద్యోగులకు వర్క్‌ఫ్రంహోం వెసులుబాటు కరోనా కేసులు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం న్యూఢిల్లీ: కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం మరింత అలర్ట్ అయింది. వీకెండ్ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే చాలారాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ దిశగానే కీలక నిర్ణయం తీసుకున్నది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధించనున్నట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం […]
ఓ మంత్రి, ఇద్దరు ఎంపీలకు పాజిటివ్ సామాజిక సారథి, హైదరాబాద్: ఇటీవల ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు, ఎంపీల్లో ఒకరికి కరోనా సోకింది. ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అయితే దాదాపు నాలుగురోజుల పాటు అక్కడే ఉన్నారు. తరువాత తెలంగాణకు తిరిగివచ్చిన మంత్రులు, ఎంపీల బృందంలో కరోనా కలకలం రేపింది. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణవడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అలాగే ఎంపీ […]
ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో అప్రమత్తం నైట్ కర్ఫ్యూతో పాటు మరిన్ని ఆంక్షలు న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండటంతో మరిన్ని ఆంక్షలకు సర్కార్ దిగింది. వైరస్ మరింత విస్తరించకుండా ఢిల్లీ సర్కార్ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. వరుసగా రెండు రోజులుగా కొవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతానికిపైగానే ఉంటుంది. దీంతో ఎల్లో అలర్ట్ ప్రణాళికను అమల్లోకి తీసుకురానున్నట్లు సీఎం అరవింద్ కేజీవ్రాల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఆదేశాలను త్వరలోనే విడుదల […]
సామాజిక సారథి, ధర్మసాగర్: మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కొరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పించాలనీ, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ లో జరిగే దీక్షకు రాష్ట నాయకత్వం జిల్లా నాయకత్వం అందరూ సకలం లో హాజరై దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట అధికార ప్రతినిధి ఒదెల శంకర్ మాదిగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తుల వెంకటేష్ , […]
రైతు అంశాలపై ప్రధాని మోడీ నిర్లక్ష్యం మద్దతు ధరలు, పరిహారం విషయంలో స్పందనలేదు పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సోనియా ఆగ్రహం న్యూఢిల్లీ: రైతుల అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తప్పుబట్టారు. రైతు సమస్యలు, సామాన్య ప్రజల విషయంలో ఎలాంటి స్పందన లేని రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పీ) చట్టపరమైన హామీ, మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతులు చేస్తున్న డిమాండ్‌కు కాంగ్రెస్ బాసటగా నిలుస్తుందని […]