సామాజికసారథి, నాగర్‌కర్నూల్ బ్యూరో: బీఎస్పీ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మాజీఎంపీ మందా జగన్నాథంకు దాదాపు టికెట్ ఖరారైంది. ఈనెల 18న ఆయన బీఎస్పీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. మందా జగన్నాథం మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత. అలంపూర్ కు చెందిన ఆయన స్వయానా డాక్టర్. ఆయన టీడీపీ నుంచి రాజకీయ అరగేట్రం చేశారు. 1999-2008(టీడీపీ), 2008-2013 (కాంగ్రెస్), 2013- 2014(టీఆర్‌ఎస్)లో ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో బీఆర్‌ఎస్ పార్టీలో […]
సామాజికసారథి, హైదరాబాద్ బ్యూరో: బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోను చూస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే!. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కు విభిన్న పథకాలను ఆ పార్టీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కాన్షీరాం యువ సర్కార్ పేరుతో యువతను షాడో మంత్రులుగా నియమిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.ఈ సందర్భంగా పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన పది ప్రధాన హామీలపై […]
సామాజికసారథి, కాగజ్ నగర్: వచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టంచేశారు. దమ్ముంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు బీసీలకు 70 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఎస్పీ అన్నివర్గాలను కలుపుకుని ముందుకెళ్తుందని అన్నారు. శుక్రవారం కాగజ్ నగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. […]
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, పెద్దపల్లి: దేశన్యాయవ్యవస్థలో కేంద్రప్రభుత్వ జోక్యం మితిమీరిపోతున్నదని, న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రమాదంలో పడేసి రాజకీయాలు చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. న్యాయవ్యవస్థ దేశంలో స్వతంత్రత గల రాజ్యాంగబద్ధ సంస్థ అని, కానీ కేంద్రం ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థను సవాల్ చేస్తూ, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. దేశంలో ఈడీ, సీబీఐ, మీడియా సంస్థలవలే న్యాయవ్యవస్థను కూడా తన చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని చూస్తుందని […]
బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి మునుగోడు: ధనం – మద్యం కాదు… జనమే మా బలం అని బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండలం రాందాస్ తండ, జాన్ తండ, దొరోనిగడ్డతండాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతలు ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకొని, దాచుకున్న సంపదను బయటకు తీస్తామని చెప్పారు. మునుగోడు […]
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నేటితో లాస్ట్ పతాకస్థాయికి పొలిటికల్ వార్ ప్రచారానికి ఒక్క రోజు మాత్రమే గడువు విస్తృతంగా ర్యాలీలు, గ్రామాల్లో సభలు ఆ హోరెత్తిన బహిరంగ సభలు, సమావేశాలు ఓటర్లతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నేతల ‘చివరి పలుకులు’ నవంబర్ 3న ఉపఎన్నిక, 6న ఫలితాలు సామాజిక సారథి, మునుగోడు ప్రత్యేక ప్రతినిధి: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఆఖరి మోఖాకు చేరింది. ప్రచారానికి తుది గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల నేతలంతా సుడిగాలి […]
ఓపెన్ కాస్ట్ భూనిర్వాసితులకు భరోసా కల్పించారు. సామాజిక సారథి, మందమర్రి (మంచిర్యాల): అధైర్యపడొద్దు అండగా ఉంటామని బిఎస్పీ నాయకులు ఎం.వి.గుణ అన్నారు. ఆదివారం దుబ్బగూడెం భూనిర్వాసితుల కుటుంబాలను కలిసి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా మందమర్రిలోని కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో కాసిపేట మండలం, దుబ్బగూడెం ప్రజలు తమ భూమి కోల్పోతున్నారని చెప్పారు. గ్రామంలో 203 ఇండ్లు ఉండగా, అధికారులు కలిసి ఇటీవల 80ఇండ్లకు తాత్కాలిక నిర్మాణం పనులు […]
బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి మునుగోడు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను వెంటనే అరెస్టు చేయాలి బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పద్మశాలీలను కలిసిన సమయంలో నేతన్నలను ఆరాధ్యధైవమైన మగ్గంపై కాళ్ళుపెట్టి అవమానించడాన్ని నిరసిస్తూ, బహుజన్ సమాజ్ పార్టీ […]