చెన్నై: కోయంబత్తూరులోని వెల్లలూరులో సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి విగ్రహం ఆదివారం అపవిత్రానికి గురైంది. పెరియార్ స్టడీ సెంటర్ ముందున్న విగ్రహానికి చెప్పుల దండ వేసి తలపై కుంకుమపువ్వు పొడిని చల్లారు. దీనిని గమనించిన స్థానికులు విషయాన్ని ద్రవిడర్ కజగం నేతలకు తెలపడంతో వారు ఆందోళనకు దిగారు. అనంతరం పోదనూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో మెడలోని చెప్పుల దండను తొలగించి.. కుంకుమను శుభ్రం చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు […]
ఢిల్లీ: ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి ఖుష్బూ సోమవారం మధ్యాహ్నం బీజేపీలో చేరారు. ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆమె మధ్యాహ్నానికే బీజేపీలో చేరారు. ఉదయం ఆమెను పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తున్నట్టు అధిష్ఠానం ప్రకటించింది. కొద్ది సేపటికే ఆమె అధినేత్రి సోనియాకు రాజీనామా లేఖను పంపారు. పార్టీలోని కొందరు నేతలు తనను రాజకీయంగా అణగదొక్కుతున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. కొంతకాలంగా ఆమె కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. […]
తమిళనాడులో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.. ఇటీవల పలువురు సినీ, రాజకీయప్రముఖుల ఇంట్లో బాంబు పెట్టామంటూ పోలీసులకు ఫోన్లు రావడం.. తీరా పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేపడితే ఏమీ దొరకపోవడం పరిపాటిగా మారింది. ఇప్పటికే సూపర్‌స్టార్ రజినీకాంత్, అజిత్, మణిరత్నం, విజయ్ తదితరుల ఇంట్లో బాంబులు పెట్టామంటూ ఆకతాయిలు ఫోన్లు చేశారు. విచారించిన పోలీసులకు అవన్నీ ఫేక్‌కాల్స్ అని తేలింది. అయితే తాజాగా ప్రముఖ హీరో ఇంట్లో బాంబులు పెట్టామంటూ పోలీసులకు బెదిరింపులు వచ్చాయి. చెన్నై అల్వార్‌పేట ఏరియాలో […]
ఇటీవలే మనందరనీ విడిచిపెట్టి వెళ్లిపోయిన ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఎంతటి నిరాడంబరుడో అంతటి మర్యాదస్తుడు. ఎంతటి సంస్కార వంతుడో అంత ప్రతిభాశాలి. ఎంతమంది కొత్త కళాకారులను ప్రోత్సహించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో పాడుతున్న చాలా మంది సింగర్స్ ఆయన ప్రోద్బలంతో వచ్చినవారే. నిజానికి ఆయన ప్రతిభ అసమానం. కేంద్రప్రభుత్వం ఆయనకు 2001 లో పద్మశ్రీ ని, 2011 లో పద్మ భూషణ్ ని ప్రకటించింది. అంతేకాక ఆయన ఆరు సార్లు జాతీయ స్థాయి […]
చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్సపొందుతూ గత శుక్రవారం గానగాంధర్వుడు, ఎస్పీ బాలు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాల్లోని ప్రజలేకాక యావత్ దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆయనకు నివాళి అర్పించారు. కాగా ఈ క్రమంలో ఎంజీఎం దవాఖానపై సోషల్‌మీడియాలో కొన్ని రూమర్లు వినిపించాయి. ఆస్పత్రి యాజమాన్యం బాల సుబ్రహ్మణ్యానికి చికిత్స చేసేందుకు లక్షల రూపాయిలు ఫీజు వసూలు చేసిందని.. ఆయన కుమారుడు చరణ్ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో బాలూ స్నేహితులు […]
ఎస్పీ బాలు భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన నివాసం నుంచి తామరైపాక్కంలోని వ్యవసాయక్షేత్రానికి తీసుకెళ్లారు. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనుంది. అయితే బాలూను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, సినీప్రియులు, తమిళనాడులో ఉంటున్న తెలుగుప్రజలు భారీగా తరలివచ్చారు. ఓ దశలో ఆయన ఇంటికి వెళ్లే దారుల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే అభిమానుల […]
ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్ శుక్రవారం ఎన్సీబీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఆమెను సుమారు 4 గంటలపాటు ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు రకుల్ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానం చెప్పిందట దీంతో అధికారులు షాక్‌కు గురయ్యారని సమాచారం. మరోవైపు రియాతో రకుల్ చాట్చేసినట్టు ఎన్సీబీకి కీలక ఆధారాలు లభించాయి. దీంతో చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్షాట్లను వారు రకుల్‌కు చూపించినట్టు టాక్. అయితే తాను రియాతో డ్రగ్స్‌కు గురించి చాటింగ్ […]
ఆయన పాట నిజంగానే పంచామృతం.. అది భక్తి పాటైనా, డ్యూయెట్ అయినా, విరహగీతమైనా, విషాధ పాటైనా ఆయన గాత్రంలోంచి వచ్చిందంటే ఓ ప్రత్యేకతను సంతరించుకుంటున్నది. తెలుగులో ఎందరో సుప్రసిద్ధ నేపథ్య గాయకులు ఉన్నప్పటికీ బాలూ గొంతు ప్రత్యేకం. ఏ హీరో నటించిన సినిమాలో ఆయన పాడితే.. అచ్చం హీరో తన గొంతులోంచి పాడినట్టే వినిపిస్తుంది. అంతటి నైపుణ్యం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం సొంతం. ఇప్పడు ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడంటే ఎంతో బాధగా ఉన్నది. ఆయన స్వరం […]