Breaking News

చెన్నై

పెరియార్ విగ్రహానికి చెప్పుల దండ

పెరియార్ విగ్రహానికి చెప్పుల దండ

చెన్నై: కోయంబత్తూరులోని వెల్లలూరులో సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి విగ్రహం ఆదివారం అపవిత్రానికి గురైంది. పెరియార్‌ స్టడీ సెంటర్‌ ముందున్న విగ్రహానికి చెప్పుల దండ వేసి తలపై కుంకుమపువ్వు పొడిని చల్లారు. దీనిని గమనించిన స్థానికులు విషయాన్ని ద్రవిడర్ కజగం నేతలకు తెలపడంతో వారు ఆందోళనకు దిగారు. అనంతరం పోదనూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో మెడలోని చెప్పుల దండను తొలగించి.. కుంకుమను శుభ్రం చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు […]

Read More
కమిటీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి

కమిటీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి

చెన్నై: మహిళల వివాహ వయసు చట్టబద్ధత బిల్లు విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానల్‌ పై డీఎంకే ఎంపీ కనిమొళి అభ్యంతరం తెలిపారు. పార్లమెంటరీ ప్యానెల్‌లో ఒకే ఒక్క మహిళను చేర్చడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా ప్రాధాన్యతతో కూడిన కమిటీని కేంద్రం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. స్త్రీల హక్కులను పురుషులే నిర్ణయించే పద్ధతి కొనసాగుతోందని మండిపడ్డారు. కాగా, అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచే బిల్లుపై అధ్యయనం చేయనున్న […]

Read More

ఖుష్బూతో బీజేపీకి లాభమెంత?

ఢిల్లీ: ప్రముఖ సినీనటి, కాంగ్రెస్​ జాతీయ అధికార ప్రతినిధి ఖుష్బూ సోమవారం మధ్యాహ్నం బీజేపీలో చేరారు. ఉదయం కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసిన ఆమె మధ్యాహ్నానికే బీజేపీలో చేరారు. ఉదయం ఆమెను పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తున్నట్టు అధిష్ఠానం ప్రకటించింది. కొద్ది సేపటికే ఆమె అధినేత్రి సోనియాకు రాజీనామా లేఖను పంపారు. పార్టీలోని కొందరు నేతలు తనను రాజకీయంగా అణగదొక్కుతున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. కొంతకాలంగా ఆమె కాంగ్రెస్​పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. […]

Read More

చెన్నైలో బాలు అంత్యక్రియలు

ఎస్పీ బాలు భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన నివాసం నుంచి తామరైపాక్కంలోని వ్యవసాయక్షేత్రానికి తీసుకెళ్లారు. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్​ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనుంది. అయితే బాలూను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, సినీప్రియులు, తమిళనాడులో ఉంటున్న తెలుగుప్రజలు భారీగా తరలివచ్చారు. ఓ దశలో ఆయన ఇంటికి వెళ్లే దారుల్లో తీవ్రమైన ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. అయితే అభిమానుల […]

Read More

తెలియదు.. మర్చిపోయా.. గుర్తులేదు! ఎన్​సీబీకి రకుల్​ ఆన్సర్స్​

ప్రముఖ నటి రకుల్ ప్రీత్​సింగ్​ శుక్రవారం ఎన్​సీబీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఆమెను సుమారు 4 గంటలపాటు ఎన్​సీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు రకుల్​ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానం చెప్పిందట దీంతో అధికారులు షాక్​కు గురయ్యారని సమాచారం. మరోవైపు రియాతో రకుల్​ చాట్​చేసినట్టు ఎన్​సీబీకి కీలక ఆధారాలు లభించాయి. దీంతో చాటింగ్​ కు సంబంధించిన స్క్రీన్​షాట్లను వారు రకుల్​కు చూపించినట్టు టాక్​. అయితే తాను రియాతో డ్రగ్స్​కు గురించి చాటింగ్​ […]

Read More

బోల్డ్ రోల్‌ కు శ్రియా సై

కెరీర్ స్టార్ట్ చేసి ఇరవై యేళ్లు దాటుతున్నా ఏ మాత్రం వన్నె తరగని హీరోయిన్ శ్రియా సరన్. ఏ పాత్ర లోనైనా ఇట్టే ఒదిగిపోవడం ఆమె స్టైల్. పెళ్లి చేసుకుని సెటిలైనా ప్రస్తుత సీనియర్ హీరోలకి ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కూడా. రీసెంట్ గా శ్రియా లీడ్ రోల్ లో నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘గమనం’ ఫస్ట్ లుక్ రిలీజయ్యింది. ఇంకో వైపు ‘ఆర్ఆర్ఆర్’ భారీ ప్రాజెక్ట్లో కూడా నటిస్తోంది. అందుకు చాలా హ్యాపీగా […]

Read More

కంగనా కొంచెం తగ్గించుకో

విలక్షణ నటుడు ప్రకాశ్​రాజ్​ బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​పై విరుచుకుపడ్డారు. కంగనా తనను తాను అతిగా ఊహించుకుంటుందని విమర్శించారు. కంగనా రాణి లక్ష్మీబాయి పాత్రలో నటించినంత మాత్రాన ఆమె నిజంగా లక్ష్మీబాయిలా ఫీలయిపోతుందని పేర్కొన్నారు. ఆమె లక్ష్మీబాయి అయితే మ‌రి ప‌ద్మావ‌తిగా న‌టించిన దీపికా ప‌దుకుణె, అక్బర్ గా న‌టించిన హృతిక్ రోష‌న్, అశోక‌ చక్రవర్తిగా న‌టించిన షారుక్, భ‌గ‌త్ సింగ్ గా న‌టించిన అజ‌య్, మంగ‌ళ్ పాండేగా న‌టించిన అమీర్​ఖాన్, మోదీగా న‌టించిన వివేక్ ఒబేరాయ్​ […]

Read More
పీఎం కిసాన్ స్కీంలో భారీ స్కాం

పీఎం కిసాన్ స్కీంలో భారీస్కాం

న‌కిలీ ల‌బ్ధిదారుల‌ ఖాతాల్లోకి డ‌బ్బులు త‌మిళ‌నాడులో ఆల‌స్యంగా వెలుగులోకి.. చెన్నై: ఆరుగాలం క‌ష్టపడే రైతుల‌కు పంట‌లు సాగు చేయ‌డానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘కొద్దిపాటి సాయం’ కూడా వారికి అంద‌కుండాపోతోంది. న‌కిలీ ల‌బ్ధిదారుల‌ను చూపిస్తూ ప‌లువురు అధికారుల అండ‌తో రైతుల‌కు అందాల్సిన న‌గ‌దును కూడా అవినీతి తిమింగ‌ళాలు సొమ్ము చేసుకుంటున్నాయి. అన్నదాతలకు న‌గ‌దు సాయం అందించే ‘పీఎం కిసాన్’ ప‌థ‌కంలో భారీ కుంభ‌కోణం వెలుగుచూసింది. త‌మిళ‌నాడులో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ఉదంతం వివరాలు ఇలా.. నకిలీ […]

Read More