Breaking News

రచ్చకెక్కిన అడ్వకేట్లు!

రచ్చకెక్కిన అడ్వకేట్లు!
  • న్యాయవాదుల సోషల్ మీడియా వార్​
  • అక్రమసంపాదకు అడ్డదారులు
  • ఒకరి తప్పులు మరొకరు చూయిస్తూ పోస్టులు
  • నాగర్ కర్నూల్ బార్ కౌన్సిల్ నవ్వులపాలు

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: న్యాయాన్ని గెలిపించాల్సిన న్యాయవాదులు రచ్చరెక్కారు. నల్లకోటుతో న్యాయదేవతను రక్షించాల్సిన కొందరు వకీల్ సాబ్ లు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. న్యాయం కోసం ఆశ్రయించిన అమాయకపు ప్రజలను నిలువునా మోసం చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. తీరా తమ అవినీతి బాగోతాలు బయటికి రావడంతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ రచ్చ రచ్చచేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన బార్ కౌన్సిల్ వాట్సాప్ గ్రూప్ లో ఒకరి తప్పులు మరొకరు వేలెత్తిచూపుకుంటూ న్యాయవ్యవస్థ పరువుతీస్తున్న ఉదంతం నాగర్ కర్నూల్​జిల్లాలో సంచలనంగా చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం మారేపల్లి దళిత రైతులను అదే జిల్లాకు చెందిన ఓ అడ్వకేట్ న్యాయం కోసం వచ్చిన దళితరైతులను నిండా ముంచారు. అమాయక దళిత రైతుల భూమికి కోర్టు నుంచి డిగ్రీ ఇప్పించాలని బాధిత దళిత రైతుల నుంచి అసలైన భూ యజమానికి వారసులు లేకున్నా ఉన్నట్లు సృష్టించి ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించి ఇతర రైతులకు కోర్టు డిగ్రీ ఇప్పించారు. ఈ విషయమై బాధిత మారేపల్లి రైతులు తమకు చేసిన అన్యాయాన్ని ఎదిరించి ఏకంగా బ్యానర్లు ప్రింట్ చేయించి ఆ న్యాయం చేసి న అడ్వకేట్ పై చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్​జిల్లా ఎస్పీ, బార్ కౌన్సిల్ కు ఫిర్యాదుచేశారు. ఈ ఘటన మరువకముందే ఇదే జిల్లాకు చెందిన మరో న్యాయవాది నాగర్ కర్నూల్ జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న దేశిటిక్యాలకు చెందిన దళిత రైతులను దగా చేశాడు. ఈ దళిత రైతులకు చెందిన విలువైన భూమిపై కన్నేసిన అడ్వకేట్ అమాయక రైతులను మోసం చేసి ఏకంగా 3.26 ఎకరాల విలువైన భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ విషయం సైతం వెలుగులోకి రావడంతో పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ బార్ కౌన్సిల్ అసోషియేషన్ వాట్సాప్ గ్రూప్ లో అవినీతి అక్రమాలకు పాల్పడి దళిత రైతులను మోసం చేసిన ఇద్దరు అడ్వకేట్లు ఒకరితప్పులను మరొకరు చూయిస్తూ పోస్టులు పెట్టుకున్నారు. ఇదే వాట్సాప్ గ్రూప్ జిల్లాకు చెందిన వందమందికి పైగా అడ్వకేట్లు ఉన్నారనే విషయం మరిచిపోయి ఒకరి మీద మరొకరు పోస్టులతో దుమ్మెత్తి పోసుకోవంతో అడ్వకేట్లు అవాక్కయ్యారు. ఇప్పటికే నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజలకు న్యాయం చేయాల్సిన అడ్వకేట్లు చేస్తున్న మోసాలను జిల్లా ప్రజలు ఛీ కొడుతుండగా ఇలా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతూ న్యాయవ్యవస్థ పరువు తీస్తున్నారని పలువురు న్యాయవాదులు, విద్యావంతులు విమర్శిస్తున్నారు.

వాట్సప్​ గ్రూపుల్లో ఛాటింగ్​(కింద ఉన్న చిత్రాలు)

One thought on “రచ్చకెక్కిన అడ్వకేట్లు!”

  1. OS no:487/21
    OS no:2583/22
    Advocate Sharath Kumar
    Advocate Naresh sunkara
    చేసినా అన్యాయాలు కూడా ప్రచురించాలని కోరుకుంటున్నాను
    వాళ్లకు సంభందించిన ఆధారాలు నేను ఇస్తాను

Comments are closed.