- రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఉపాధ్యాయిని భర్త
- ఇద్దరికీ దేహశుద్ధి.. పెద్దల సమక్షంలో పంచాయితీ
- నాగర్ కర్నూల్ జిల్లాలో సంచనలమైన ఘటన
సామాజికసారథి, నాగర్ కర్నూల్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని చక్కదిద్దాల్సిన ఉపాధ్యాయులే దారితప్పారు. విలువలను మరిచి కామకేళిలో మునిగిపోయారు. పవిత్రమైన వృత్తికే కళంకం తెచ్చారు. సదరు ఉపాధ్యాయిని భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదడం జిల్లాలో సంచలనంగా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సాతాపూర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూలులో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్, ఉపాధ్యాయుడి మధ్య స్నేహం చిగురించింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అది కూడా హద్దులు దాటింది. సదరు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుడు నాగర్ కర్నూల్ లోని వారి ఇంటిలో కామక్రీడకు దిగారు. పక్కా ప్లాన్ తో ఆమె భర్త ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఇలాంటి పనులు చేయడం ఏమిటని సభ్యసమాజం ప్రశ్నిస్తోంది.