అబుదాబి: ఐపీఎల్13లో కీలకమైన మ్యాచ్‌లో సన్రైజర్స్హైదరాబాద్ ఘనవిజయం సాధించింది. రాయల్‌చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచి క్వాలిఫయర్-2లో అడుగుపెట్టింది. ఆర్సీబీ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని కొద్దిగా కష్టంగానే ఛేదించింది. సన్రైజర్స్కీలక ఆటగాళ్లు కేన్ విలియమ్సన్(50 నాటౌట్; 44 బంతుల్లో 4×2, 6×2), హోల్డర్(24 నాటౌట్; 20 బంతుల్లో 4×3) జట్టుకు విజయాన్ని అందించడంలో చివరి దాకా నిలిచారు. వార్నర్(17; 17 బంతుల్లో 4×3)పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఎక్కువ సేపు […]
షార్జా: సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి తన తడాఖా చూపించింది. ఐపీఎల్13లో భాగంగా షార్జా వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. సన్‌రైజర్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కించుకుంది. ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. తొలుత బౌలింగ్‌లో ఇరగదీసిన సన్‌రైజర్స్, బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(85 నాటౌట్; […]
దుబాయ్: ఐపీఎల్ సీజన్ 13లో భాగంగా దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఓటమి పాలైంది. దీంతో ఈ టోర్నీ నుంచి రాజస్తాన్ నిష్క్రమించింది. కేకేఆర్ నిర్దేశించిన 192 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే ఓటమి పాలైంది. రాజస్తాన్ జట్టులో జోస్ బట్లర్(35; 22 బంతుల్లో 4×4, 6×1), తెవాటియా(31; 27 బంతుల్లో 4×2, 6×1), శ్రేయస్ […]
అబుదాబి: ఐపీఎల్ 13 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇక ఇంటిబాట పట్టింది. ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం చెందడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. తద్వారా ప్లే ఆఫ్ రేసు నుంచి వెళ్లిన రెండో జట్టుగా నిలిచింది. పంజాబ్ ముందుగా బ్యాటింగ్ చేసి 153 స్కోరు చేసింది. ఆ లక్ష్యాన్ని ధోని సేన 18.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ ఛేదించింది. డుప్లెసిస్(48; 34 బంతుల్లో 4×4, 6×2), రుతురాజ్ గైక్వాడ్(62 […]
అబుదాబి: ఐపీఎల్13 సీజన్లో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన 50వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్పంజాబ్పై రాజస్తాన్రాయల్స్7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన పంజాబ్ దూకుడుకు బ్రేక్ పడినట్లయింది. రాజస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్చేసిన కింగ్స్ పంజాబ్ 186 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. క్రిస్ గేల్ (99; 63 బంతుల్లో 4×6, 6×8), కేఎల్ రాహుల్ (46;41 బంతుల్లో 4×3, 6×2) రాణించడంతో పాటు పూరన్(22; […]
షార్జా: ఐపీఎల్13వ సీజన్లో మొదట వరుసగా ఐదు ఓటముల తర్వాత ఒక్కసారి పుంజుకున్న కింగ్స్ పంజాబ్ ఎలెవన్ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. షార్జా వేదికగా జరిగిన 46వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై కింగ్స్ ఎలెవన్పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్చేసిన కోల్‌కతా 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. లక్ష్యఛేదనలో భాగంగా కేఎల్ రాహుల్(28;25 బంతుల్లో 4×4), మన్దీప్ సింగ్(66 నాటౌట్; 56 బంతుల్లో 4×8 ఫోర్లు, 6×2), […]
అబుదాబి: అబుదాబి వేదికగా ఐపీఎల్13 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్(డీఐ)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. కలకత్తా 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకు ఢిల్లీ కుప్పకూలింది. ఐదు వికెట్లు తీసి కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. ఢిల్లీ ఓపెనర్లు అజింక్యా రహానే(0), శిఖర్ ధావన్(6) నిరాశపరిచారు. శ్రేయస్ అయ్యర్(47;38 బంతుల్లో 4×4), […]
దుబాయ్: టీ20 మ్యాచ్‌ల్లో అభిమానులకు ఇదీ సిసలైన మ్యాచ్.. మొదటి మ్యాచ్ టై కాగా, సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా టై అయింది. మరో సూపర్ ఓవర్ మ్యాచ్ గెలుపును తేల్చింది. ఈ ఉత్కంఠభరిత పోరు ఐపీఎల్ 13 సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆవిష్కృతమైంది. నరాలు తెగే టెన్షన్ మధ్య పంజాబ్ విజయం సాధించింది. అంతకు ముందు ముంబై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని […]