Breaking News

Day: October 17, 2020

అర్ధరాత్రి కుండపోత

అర్ధరాత్రి కుండపోత

సారథి న్యూస్, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి సుమారు రెండుగంటల పాటు ఏకధాటిగా వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో ఆకాశమంతా దద్దరిల్లింది. చెరువులు, కుంటలు ఏమయ్యాయి. లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబ్​నగర్, వనపర్తి, నల్లగొండ, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. భారీవర్షానికి హైదరాబాద్ లోని ఎల్బీనగర్ నుంచి […]

Read More
మావోయిస్టు మిలిషియా సభ్యుడి అరెస్ట్

మావోయిస్టు మిలిషియా సభ్యుడి అరెస్ట్

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో శనివారం మావోయిస్టు మిలిషియా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన మిడియం చిన్నలక్ష్మయ్య అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. మూడేళ్లుగా మిలిషియా సభ్యుడిగా పనిచేస్తూ, ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీకి నిత్యావసర వస్తువులు అందజేస్తూ.. వారు గ్రామానికి వచ్చినప్పుడల్లా వారికి భోజన వసతి ఏర్పాటు చేస్తూ.. పోలీస్ వారి కదలికలను ఎప్పటికప్పుడు […]

Read More
జోరు తగ్గని మాస్​మహారాజా

జోరు తగ్గని మాస్​ మహారాజా

మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ సినిమా సెట్స్ పై ఉండగానే తన కొత్త సినిమాను అనౌన్స్ చేసేశాడు. ఇప్పటికే రెండు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చిన రవితేజ అందులో మొదటగా రమేష్ వర్మ సినిమాను కన్​ఫమ్​చేసినట్టు ట్వీట్ చేశాడు. రీసెంట్​గా రమేష్ వర్మతో ‘రాక్షసుడు’ తీసి సక్సెస్ అందుకున్న కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆదివారం ఉదయం 11:55 గంటలకు ఈ సినిమాను స్టార్ట్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయనున్నారు. రవితేజ కెరీర్‌లో […]

Read More
మహానటికి ‘సర్కారువారి’ స్వాగతం

మహానటికి సర్కారు వారి స్వాగతం

‘మహానటి’ తర్వాత టాలీవుడ్‌లో ఎంతో బిజీ అయిపోయింది కీర్తి సురేష్. వరుస తెలుగు సినిమాల ఆఫర్లు ఆమెను వరించడంతో పాటు తాజాగా మహేష్ బాబు సరసన కూడా నటించే అవకాశం అందుకుంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేష్​కు జంటగా కీర్తి సురేష్ పేరు కొన్నినెలలుగా వినిపిస్తోంది. ఇప్పుడి కాంబినేషన్‌ కన్ఫర్మ్ అయింది. శనివారం తన బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు స్వయంగా ఈ విషయాన్ని రివీల్ చేస్తూ.. ‘సూపర్ టాలెంటెడ్‌ […]

Read More
వర్షాలు కురుస్తున్నయ్.. మంత్రి, ఎంపీ ఎక్కడ?

వర్షాలు కురుస్తున్నయ్.. మంత్రి, ఎంపీ ఎక్కడ?

సారథి న్యూస్, కరీంనగర్: కరీంనగర్​ జిల్లావ్యాప్తంగా భారీవర్షాలతో రైతులు అల్లాడుతుంటే జిల్లాకు చెందిన సివిల్ సప్లయీస్ ​మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ ఎక్కడ ఉన్నారని కాంగ్రెస్​ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులుగౌడ్ ప్రశించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ చీరల పంపిణీపై ఉన్న శ్రద్ధ అకాలవర్షంతో అల్లాడుతున్న రైతులపై లేదన్నారు. కనీసం రైతులకు భరోసా కల్పించే సమయం లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు పేరుతో రైతులను […]

Read More
ఎల్లూరు వెళ్తున్న కాంగ్రెస్​నేతల అరెస్ట్​

ఎల్లూరు వెళ్తున్న కాంగ్రెస్ ​నేతల అరెస్ట్​

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: కొల్లాపూర్ వద్ద ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఎల్లూర్ లిఫ్ట్ ప్రాజెక్టు పంపులు మునిగిపోవడంతో పరిశీలించేందుకు వెళ్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్​మల్లురవి, ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ ను నాగర్​కర్నూల్​జిల్లా తెల్కపల్లి పోలీసులు అడ్డుకుని అరెస్ట్​ చేశారు. ఈ సమయంలో ఎంపీ రేవంత్​రెడ్డి కాలికి గాయమైంది.

Read More
వరద బాధితులు భయపడొద్దు

వరద బాధితులు భయపడొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: మూడు రోజుల క్రితం కురిసిన అకాలవర్షాలకు తీవ్రంగా నష్టపోయిన అడ్డుగుట్ట డివిజన్ లోని చంద్రబాబు నాయుడు నగర్ కు చెందిన ముప్పు బాధితులను డిప్యూటీ స్పీకర్​తిగుళ్ల పద్మారావుగౌడ్​పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి, బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రకృతి ప్రళయం కారణంగా చాలా ప్రాంతాలను అతలాకుతలం చేసిందన్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

Read More
పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి

పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో వరుసగా నాలుగో రోజు వరద ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పరిశీలించారు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన పలువురికి రూ.ఐదులక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు. పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టిసారించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. అంటురోగాలు ప్రబలకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు […]

Read More