ఉత్తర్‌ప్రదేశ్‌లో లైంగికదాడుల పర్వం కొనసాగుతున్నది. హత్రాస్ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు సాగుతున్న వేళ మరో దారుణం చోటుచేసుకున్నది. తాజాగా ఓ పదిహేడేండ్ల విద్యార్థినిపై ఓ నీచుడు లైంగికదాడి చేయగా అతడి ఫ్రెండ్స్ వీడియో తీశారు. ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీకి చెందిన ఓ యువతి అదే పట్టణంలో పాల్టెక్నిక్ చదువుతున్నది. కొంతకాలంగా ఆమెను ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కాలేజీకి వెళ్లిన విద్యార్థినిని సదరు యువకుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఆనంతరం ఓ ఇంట్లోకి […]
కొంతకాలంగా హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు చేస్తున్న ముఠా సైబారాబాద్ పోలీసులకు చిక్కింది. ఉత్తరప్రదేశ్ సరిహద్దులో వీరిని అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితుల నుంచి రూ.5లక్షల నగదు, బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 6న ఈ ముఠా హైదరాబాద్ రాయదుర్గంలో ఈ ముఠా దొంగతనానికి పాల్పడింది. మధుసూదన్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ ఇంట్లో పనిమనుషులుగా చేరిన ముఠా సభ్యులు వారి కుటుంబానికి భోజనంలో మత్తు మందు ఇచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. […]
సారథి న్యూస్, రామడుగు: మనీషా వాల్మికిపై లైంగికదాడి జరిపిన నిందితులను వెంటనే ఉరితీయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో మనీషా పై నలుగురు దుండగులు లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులు మనీష చిత్రపటంతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తడగొండ శంకర్ […]
బాలీవుడ్ డేరింగ్ బ్యూటీ, వివాదాస్పద నటిపై ఇప్పడు సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతి విషయంపై స్పందించే కంగనా రనౌత్ యూపీలోని హథ్రాస్ జిల్లాలో ఓ మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటనను ఎందుకు ఖండించడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. ‘సుశాంత్, డ్రగ్స్‌కేసులో తీవ్రంగా స్పందించిన కంగనా ఇప్పుడెందుకు సైలంట్ అయ్యింది’ అంటూ ఓ నెటిజన్ల సోషల్‌మీడియాలో కామెంటు చేశారు. ప్రస్తుతం ఫేస్బుక్, వాట్సాప్ వేదికగా చాలా మంది కంగనాను టార్గెట్ చేశారు.కంగన బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నదని […]
లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ సామూహికల లైంగికదాడి ఘటన విషయంలో.. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. నిబంధనలను అతిక్రమించినందుకు గానూ ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆజాద్ తో పాటు మరో 400 మందిపై కేసులు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరి పేర్లను వెల్లడించలేదు. హత్రాస్ బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించడానికి ఆదివారం తన అనుచరులతో కలిసి […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పసుపుల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలకు పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించలేని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను బర్తరఫ్చేయాలని డిమాండ్ చేశారు. హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన దారుణ ఘటనను ఖండిస్తూ.. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద […]
సారథి న్యూస్, కర్నూలు: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌లో దళిత యువతిపై దారుణానికి పాల్పడిన మానవమృగాలను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, కల్వకుర్తి: ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ.. దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో యువజన, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ ఆఫీసు నుంచి మహబూబ్‌నగర్ చౌరస్తా మీదుగా హైదరాబాద్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో దళిత మహిళలపై వరుసగా […]