కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సామాజికసారథి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులు ఉండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇదే అనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని రకాల […]
భూమిని విక్రయించడంలో అడ్డు పడుతున్నాడని వ్యక్తి హత్యకు పథకం ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన హసన్ పర్తి పోలీసులు. సామాజికసారథి, వరంగల్ ప్రతినిధి: భూమిని విక్రయించడంలో అడ్డుపడుతున్నాడన్న కారణంగా ఒక వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ఆరుగురు సబ్యుల ముఠా శుక్రవారం హసన్ పర్తి పోలీసులు ఆట కట్టించారు. ఎంతో చాకచక్యంగా ఎం.డి. అక్బర్ బండ జీవన్ తౌటం వంశీ కృష్ణ ,ఎం.డి.ఆజ్ఞర్ ఎస్.కె సైలానీ, బుర్ర అనిల్, అనే ఆరుగురుని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.వీరి […]
శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం దాకా.. ఉద్యోగులకు వర్క్ఫ్రంహోం వెసులుబాటు కరోనా కేసులు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం న్యూఢిల్లీ: కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం మరింత అలర్ట్ అయింది. వీకెండ్ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే చాలారాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ దిశగానే కీలక నిర్ణయం తీసుకున్నది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధించనున్నట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం […]
నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద సామాజిక సారథి, నల్లగొండ క్రైం: ఆపరేషన్ స్మైల్- 8ను విజయవంతం చేయడానికి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అదనపు ఎస్పీ నర్మద అన్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో కార్మికశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీస్, బాలల సంక్షేమ సమితి, ఇతరశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కృషి చేయాలని ఆదేశించారు. బాలలతో […]
నగర శివార్లలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా వార్షిక నివేదికను ఆవిష్కరించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్ సామాజికసారథి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నాలుగు శాతం నేరాలు పెరిగాయి. అలాగే పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలో కేసుల సంఖ్య పెరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాలు చేసిన […]
సామాజిక సారథి, పెద్ద శంకరంపేట: పోలీసులు ప్రజలతో మమేకమై సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని మెదక్ డీఎస్పీ సైదులు అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేసిన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అంతకు ముందు స్టేషన్ లో పలు రికార్డులు, పోలీస్ సిబ్బంది పనితీరు, పరేడ్, మెయింటినెన్స్, క్రైమ్ తదితర వివరాలను పరిశీలించారు. గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పేట ఎస్ఐ నరేందర్ కు డీఎస్పీ సూచించారు.. పెద్దశంకరంపేట […]
ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు ముష్కరులు ‘ఫిదాయీన్’ సంస్థకు చెందిన వారిగా గుర్తింపు శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు దాడికి తెగబడ్డారు. పోలీసులతో వెళ్తున్న బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడ్డారు. 2019లో ఆర్టికల్ 370ను రద్దుచేసిన తర్వాత ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే తొలిసారి. శ్రీనగర్ శివారులో శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై పంతాచౌక్ ప్రాంతంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. ఈ […]
ఆధారాల సేకరణకు యత్నాలు సామాజిక సారథి, హైదరాబాద్: పలువురిని మోసం చేసిన కేసులో శిల్పాచౌదరిని రెండో రోజు నార్సింగి పోలీసులు విచారించారు. గండిపేటలోని శిల్పా నివాసం సిగ్నేచర్ విల్లాకు ఆమెను పోలీసులు తీసుకెళ్లారు. ఆధారాల సేకరణకు శిల్పాచౌదరి ఇంట్లో పోలీసుల తనిఖీలు చేశారు. మీడియా కంటపడకుండా రహస్యంగా పోలీసుల విచారణ చేశారు. సాయంత్రానికి శిల్పాచౌదరి పోలీస్ కస్టడీ ముగిసింది. మరో రెండు కేసులకు సంబంధించి శిల్పాను తిరిగి కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలు కీలకమైన […]