Breaking News

ATTACK

పోలీసుల బస్సుపై ఉగ్రదాడి

పోలీసుల బస్సుపై ఉగ్రదాడి

ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు ముష్కరులు ‘ఫిదాయీన్’ సంస్థకు చెందిన వారిగా గుర్తింపు శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు దాడికి తెగబడ్డారు. పోలీసులతో వెళ్తున్న బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడ్డారు. 2019లో ఆర్టికల్ 370ను రద్దుచేసిన తర్వాత ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే తొలిసారి. శ్రీనగర్ శివారులో శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై పంతాచౌక్ ప్రాంతంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. ఈ […]

Read More
నాటుసారా స్థావరాలపై దాడులు

నాటుసారా స్థావరాలపై దాడులు

సామాజిక సారథి‌, ఏన్కూరు: మండలంలోని గార్లఒడ్డులో  గురువారం సాయంత్రం నాటుసారా స్థావరాలపై జిల్లా ఎక్సైజ్ ట్రాస్క్ ఫోర్స్ సీఐ పోశెట్టి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీ కోసం నిల్వ ఉంచిన 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో  సిబ్బంది రాజు, మధు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Read More
పోలీసులకు గురిపెట్టాడు

పోలీసులకే గురిపెట్టాడు

ఢిల్లీ: పోలీసుల మీదకు రివాల్వర్​ గురిపెట్టిన ఓ దోపిడీ దొంగను గురువారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని అండ్రూస్​ గంజ్​కు చెందిన ఓవ్యక్తి ప్రజలను బెదిరిస్తూ డబ్బు, నగలు దోపిడీ చేస్తున్నాడు. స్థానికులు ఫిర్యాదుతో సదరు నిందితుడిని అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. దీంతో ఆ క్రిమినల్​ ఓ పోలీస్​ను రివాల్వర్​తో కాల్చబోయాడు. అప్రమత్తమైన మరో కానిస్టేబుల్​ చాకచక్యంగా అతడిని వెనుకనుంచి పట్టుకొన్నాడు. అనంతరం అతడిని పోలీసులు రిమాండ్​కు తరలించారు.

Read More
టీవీ నడుడిపై దాడి

టీవీ నటుడిపై దాడి

ఢిల్లీ: టీవీ నటుడు అన్ష్​ బాగ్రీపై ఓ రౌడీ గ్యాంగ్​ దాడి చేసింది. అతడి తలకు తీవ్రగాయాలు కావడంతో ప్రస్తుతం దవాఖానలో చికిత్సపొందుతున్నాడు. ఓ కాంట్రాక్టర్​తో గొడవే దాడికి కారణమని తెలుస్తున్నది. అన్ష్​ ఇటీవల ఢిల్లీలో తన ఇంటిని నిర్మించే ఇచ్చే పనిని ఓ కాంట్రాక్టర్​కు అప్పగించాడు. సదరు కాంట్రాక్టర్​ ఇంటిని అసంపూర్తిగా వదిలేశాడు. ఈ క్రమంలో అన్ష్​ ఆ కాంట్రాక్టర్​తో గొడవకు దిగాడు. దీంతో కోపం పెంచుకున్న కాంట్రాక్టర్​ అన్ష్​ ఇంటికి 10 మంది రౌడీలను […]

Read More

ఆర్జీవీ తర్వాత టార్గెట్​ బాలయ్యేనా?

ఇప్పటికే ‘పవర్​స్టార్​’ అనే సినిమా తీసి సంచలనం సృష్టించిన ఆర్జీవీ.. తర్వాత మరో అగ్రనటుడు బాలకృష్ణను టార్గెట్​ చేయబోతున్నట్టు సమాచారం. 16 ఏండ్ల క్రితం బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో బెల్లంకొండ సురేశ్​ గాయపడ్డాడు. తర్వాత రాజకీయ కారణాలతో ఈ కేసు మరుగున పడింది. ఆ రాత్రి బాలయ్యబాబు ఇంట్లో ఏం జరిగిందో అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కరి మనస్సులోనూ ఉండిపోయింది. అయితే కాలక్రమేణా ఆ ఘటనను అందరు మరిచిపోయారు. కానీ […]

Read More

ఆర్జీవీ x పవన్​ఫ్యాన్స్..​ లాభం ఎవరికి?

సంచలన దర్శకుడు రాంగోపాల్​వర్మ ‘పవర్​స్టార్​’ అంటూ ఓ సినిమాను ప్రకటించడంతోపాటు దాని ట్రైలర్​ను విడుదల చేశాడు. కొంతకాలం పాటు సైలెంట్​గా ఉన్న పవన్​కల్యాణ్ ఫ్యాన్స్​ ట్రైలర్​ విడుదల కాగానే రెచ్చిపోయారు. ఆర్జీవీ ‘పవర్​స్టార్’​కు కౌంటర్​గా ‘పరాన్నజీవి’ అనే సినిమాను నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. అనంతరం చిత్రంలో ఆర్జీవీని టార్గెట్​ చేస్తూ ఓ పాటను రిలీజ్​ చేశారు. కానీ ఈ పాట పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. గురువారం ఏకంగా హైదరాబాద్​లోని ఆర్జీవీ కార్యాలయంపై ఓయూ జేఏసీ పేరిట దాడి జరిగింది. ఈ […]

Read More

జర్నలిస్టుపై కాల్పులు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నడిరోడ్డులో ఒక జర్నలిస్ట్‌పై దుండగులు కాల్పులు జరిపారు. కొద్దిరోజుల క్రితం తన మేనకోడలిని వేధించారని సదరు జర్నలిస్టు ఫిర్యాదు చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న ఆకతాయిలు కాల్పులు జరిపిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్​లోని ఘజియాబాద్​లో విక్రమ్​ జోషి ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విక్రమ్​ తన కూతురుతో కలిసి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆకస్మికంగా కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ […]

Read More
జర్నలిస్టులపై దాడులు సరికాదు

జర్నలిస్టులపై దాడులు సరికాదు

సారథి న్యూస్, నారాయణఖేడ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నదని సంగారెడ్డి జిల్లా ఆమ్​ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు బోర్గి సంజీవ్​ ఆరోపించారు. జర్నలిస్ట్​ తీన్మార్​ మల్లన్నపై దాడిని ఆప్​ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. పక్కాప్లాన్ ప్రకారమే ఆయనపై ఎమ్మెల్యే జీవన్​రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. సీఎం కేసీఆర్​ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆమ్​ఆద్మీపార్టీ జర్నలిస్టులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Read More