Breaking News

Day: December 31, 2021

ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ నేతలకు కరోనా

ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ నేతలకు కరోనా

ఓ మంత్రి, ఇద్దరు ఎంపీలకు పాజిటివ్‌ సామాజిక సారథి, హైదరాబాద్‌: ఇటీవల ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు, ఎంపీల్లో ఒకరికి కరోనా సోకింది. ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అయితే దాదాపు నాలుగురోజుల పాటు అక్కడే ఉన్నారు. తరువాత తెలంగాణకు తిరిగివచ్చిన మంత్రులు, ఎంపీల బృందంలో కరోనా కలకలం రేపింది. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణవడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అలాగే ఎంపీ […]

Read More
విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్‌

విస్తృతంగా డ్రంకెన్​డ్రైవ్‌

నేడు హైదరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు మూడు కమిషనరేట్ల పరిధిలో ఫ్లై ఓవర్ల మూసివేత మద్యం తాగి పట్టుబడితే వాహనాలు సీజ్​ సామాజికసారథి, హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నగరంలోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్ల పరిధిలో ఇవి అమల్లో ఉంటాయని ప్రకటించారు. డిసెంబర్‌ 31 రాత్రి 11 నుంచి జనవరి 1 ఉదయం 5గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని […]

Read More
జంటలను.. మైనర్లను అనుమతించొద్దు

జంటలను.. మైనర్లను అనుమతించొద్దు

పబ్బుల్లో తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలి ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సామాజిక సారథి, హైదరాబాద్‌: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పబ్బులకు జంటలను, మైనర్లను అనుమతించొద్దని హైకోర్డు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అమలు పరచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఈ వ్యవహారంలో హైదరాబాద్‌ పోలీసులు ఊహించిన దానికంటే ఎక్కువగానే చర్యలు తీసుకుంటున్నారని అభిప్రాయపడింది. పబ్బుల ఎదుట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించింది. తాగి వాహనం నడిపితే పబ్బు నిర్వాహకులదే బాధ్యత […]

Read More
ప్రాణాలకన్నా.. ఆదాయమే ముఖ్యమా

ప్రాణాలకన్నా.. ఆదాయమే ముఖ్యమా

  • December 31, 2021
  • Comments Off on ప్రాణాలకన్నా.. ఆదాయమే ముఖ్యమా

టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫైర్ సామాజిక సారథి, హన్మకొండ: టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలకంటే, ఆదాయమే ముఖ్యమైపోయిందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసినవిలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకలను రాత్రి 12 గంటల వరకూ అనుమతించడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనా విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల పని తీరు దారుణంగా ఉందన్నారు. కరోనా మూడోవేవ్ తీవ్రరూపం దాల్చే అవకాశముందని, […]

Read More
టీఎస్ ఆర్టీసీ న్యూ ఇయర్ గిఫ్ట్

టీఎస్ ఆర్టీసీ న్యూ ఇయర్ గిఫ్ట్

  • December 31, 2021
  • Comments Off on టీఎస్ ఆర్టీసీ న్యూ ఇయర్ గిఫ్ట్

ఎండీ సజ్జన్నార్ కీలక నిర్ణయం సామాజికసారథి, హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ఎండీగా డైనమిక్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీలో కీలక మార్పులు చేస్తున్నారు. ప్రయాణికులను ఆకర్షించి ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకెళ్లేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సంస్థలో చాలా మార్పులతోపాటు ఆదాయం భారీగా పెరిగింది. అయితే, న్యూ ఇయర్‌లోకి అడుగిడుతున్న వేళ సజ్జనార్ మరో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 రోజున బస్సులో ప్రయాణించే 12 ఏళ్ల […]

Read More
ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయాలి

ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయాలి

 నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద సామాజిక సారథి, నల్లగొండ క్రైం: ఆపరేషన్ స్మైల్- 8ను విజయవంతం చేయడానికి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అదనపు ఎస్పీ నర్మద అన్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో కార్మికశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీస్, బాలల సంక్షేమ సమితి, ఇతరశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కృషి చేయాలని ఆదేశించారు. బాలలతో […]

Read More
నాలల సమస్యకు చెక్

నాలల సమస్యకు చెక్

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మొదటి దశలో రూ.859 కోట్లతో అభివృద్ధి ఫీవర్‌ ఆస్పత్రి వద్ద నాలగోడ నిర్మాణానికి శంకుస్థాపన సామాజిక సారథి, హైదరాబాద్‌: భాగ్యనగరంలో నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. స్ట్రాటజిక్‌ నాలా డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఫీవర్‌ ఆస్పత్రి వద్ద రక్షణ గోడ నిర్మాణానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొదటి దశలో రూ.859 కోట్లతో […]

Read More
జీవో రద్దు చేయాలి: ఎంపీ పొన్నం లేఖ

జీవో రద్దు చేయాలి: ఎంపీ పొన్నం లేఖ

  • December 31, 2021
  • Comments Off on జీవో రద్దు చేయాలి: ఎంపీ పొన్నం లేఖ

కాంగ్రెస్‌ మాజీ  ఎంపీ పొన్నం ప్రభాకర్‌ లేఖ సామాజికసారథి, కరీంనగర్‌: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ నాయకుడు పొన్నం ప్రభాకర్‌ బహిరంగ లేఖ రాశారు. ఉపాధ్యాయుల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్న జీవో 317ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులను సొంత జిల్లాల నుంచి బలవంతంగా ఇతర జిల్లాలకు బదిలీ చేయడం అన్యాయమన్నారు. ఇలాంటి ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.  రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, […]

Read More