సామాజిక సారథి, మునుగోడు: ఓటు అనేది మన తల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అలవోకగా వేస్తే, ఒళ్లు మరిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోతది. చాలా జాగ్రత్తగా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బతుకులు, మునుగోడు బాగుపడుతాయి. తెలంగాణ, భారతదేశం కూడా బాగుపడ్తది. ఎవరో చెప్పారని, మర్యాద చేశారని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించిందని ఓటేస్తే ప్రమాదం వస్తది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ […]
నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద సామాజిక సారథి, నల్లగొండ క్రైం: ఆపరేషన్ స్మైల్- 8ను విజయవంతం చేయడానికి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అదనపు ఎస్పీ నర్మద అన్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో కార్మికశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీస్, బాలల సంక్షేమ సమితి, ఇతరశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కృషి చేయాలని ఆదేశించారు. బాలలతో […]
నగర శివార్లలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా వార్షిక నివేదికను ఆవిష్కరించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్ సామాజికసారథి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నాలుగు శాతం నేరాలు పెరిగాయి. అలాగే పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలో కేసుల సంఖ్య పెరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాలు చేసిన […]
నిరంతరాయంగా ధాన్యం కొనుగోళ్లు కేంద్రం తీరుపై మంత్రి గంగుల మండిపాటు సామాజిక సారథి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎఫ్‌సీఐ తీరుతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. రైతుల పట్ల కేంద్రం, ఎఫ్‌సీఐ తీరు విచారకరమని వెల్లడించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సోమవారం మంత్రి సమిక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు, నగదు […]
టాటా ఏరోస్టక్చ్రర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ సామాజిక సారథి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రగతిశీల విధానాలు, మౌలిక సదుపాయాలతో ఏరోస్సేస్ రంగం ఐదేళ్లలో అపూర్వమైన వృద్ధిని సాధించిందని మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. ఐదేళ్లుగా తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. టీఎస్ ఐపాస్‌తో వేగంగా, పారదర్శకంగా అభివృద్ధి కొనసాగుతుందన్నారు. ఏరోస్పేస్ సెక్టార్‌లో 2020లో తెలంగాణకు అవార్డు వచ్చిందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. మంగళవారం ఆదిభట్లలో టాటా ఏరోస్టక్చ్రర్లిమిటెడ్ ఫైటర్ వింగ్స్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ […]
డాక్టర్ల ఉదాసీన వైఖరి సరికాదు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, తదితర శాఖల అధికారులతో వ్యాక్సినేషన్ పురోగతిపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒమిక్రాన్ తో ముప్పు పొంచి ఉందని, వందశాతం వ్యాక్సినేషన్ […]
సామాజిక సారథి, ములుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్థానిక అధికారులతో బుధవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకూ జరగనున్న జాతర కోసం వసతుల కల్పన, ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సలహాలు సూచనలు అందించారు. ముందుగా మేడారం అమ్మవార్లు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. జంపన్న వాగు […]
సామాజిక సారథి, కౌడిపల్లి: యాసంగి లో పంటల సాగు పగడ్బందీగా సర్వే నంబరు ప్రకారం ప్రతి రైతు పంట సాగు వివరాలను నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్ సూచించారు. బుధవారం కౌడిపల్లి రైతు వేదికలో కౌడిపల్లి డివిజన్ లోని నాలుగు మండలాలకు సంబంధించిన వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం వాన కాలంలో అధిక మొత్తంలో వరి పండించడం […]