Breaking News

డబ్బు లిక్కర్ కాదు… జనమే మా బలం 

  • బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సామాజిక సారథి మునుగోడు: ధనం – మద్యం కాదు… జనమే మా బలం అని బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండలం రాందాస్ తండ, జాన్ తండ, దొరోనిగడ్డతండాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతలు ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకొని, దాచుకున్న సంపదను బయటకు తీస్తామని చెప్పారు. మునుగోడు ఎన్నికల్లో బంగారం, డబ్బు, మద్యం ఏరులై పారుతున్న ప్రజలు బీఎస్పీకి పట్టం కట్టబోతున్నారని చెప్పారు. గత 67 ఏండ్లలో 67శాతం జనాభా ఉన్న బీసీలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మోసం చేశాయన్నారు. దొరల మెడలు వంచడానికే బీఎస్పీ ఒక బిసి బిడ్డకు టికెట్ ఇచ్చామన్నారు. ఇంతకాలం పాలించిన నాయకులు కనీసం ఇళ్ళు కూడా కట్టించలేకపోయారని ఎద్దేవా చేశారు. బీఎస్పీ అంటేనే ప్రజల కోసం పనిచేసే పార్టీ అన్నారు. మునుగోడులో ఇప్పటికే 170కోట్ల మద్యం, 70 కోట్ల మాంసం పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, పూదరి నర్సింహ, నాగేంద్రబాబు, మండల నాయకులు సుజాత, పృధ్వీ, సురేష్, రమావత్ రమేష్ నాయక్, రవి తదితరులు పాల్గొన్నారు.